Sunday, April 28, 2024

Red alert- ముంపు వాసులకు అండగా మేమంతా ఉన్నాం – జిల్లా కలెక్టర్, ఎస్పీ భరోసా

సమిష్టిగా పనిచేసి విపత్తుని ఎదుర్కొందాం …
ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలి ……
అధికారులందరూ అప్రమత్తం..జిల్లా లో రెడ్ అలెర్ట్..ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దు.

భద్రాచలం జూలై 26 ప్రభ న్యూస్: ప్రమాదకర పరిస్థితుల్లో పరవాళ్ళు తొక్కుతున్న గోదావరి ఉధృతిని ప్రతిక్షణం గమనిస్తూ ప్రాంతాల అప్రమత్తతకై ప్రతి అధికారి శక్తివంచ లేకుండా పనిచేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ప్రియాంకల ఎస్పీ వినీత్ లు అన్నారు.భద్రాచలం ఆర్డీవో కార్యాలయంలో బుధవారం రాత్రి జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు.భద్రాచలం వద్ద గోదావరిపై రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయటంతో రెడ్ అలర్ట్ ఉన్నట్లేనని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా ఏడు రహదారులు మూసుకుపోయాయని, వరద ఉధృతి పెరిగితే మరో 15 మూసి పోయే అవకాశం ఉందని ఆమె తెలిపారు.

జిల్లా వ్యాప్తంగా వెయ్యికి పైగా నీటి నిల్వ ఉంచే చెరువులు ట్యాంకులు పూర్తిగా నిండి ఉన్నాయని మరొక 500 కూడా రాబోయే రోజుల్లో నిండే అవకాశం ఉందని ఆమె పేర్కొన్నారు. రానున్న 24 గంటలలో అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఇంటిని వీడాలని ఆమె సూచించారు. ముంపు ప్రాంతాలకు ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని ఆయా ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆ కంట్రోల్లో ఉన్న అధికారులతో అవసరమైనప్పుడు సంప్రదింపులు జరపాలని కోరారు.

అనంతరం జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ మాట్లాడుతూ విషమ పరిస్థితుల్లో చిక్కుకున్న జిల్లా ప్రజలు వాట్స్ అప్ ద్వారా పోలీస్ శాఖ కు పంపించినట్లయితే తక్షణమే ఎన్ డి ఆర్ ఎఫ్ పంపి సహాయం అందిస్తామని తెలిపారు. మరో 48 గంటల వరకు తాను ప్రతి పోలీస్ స్టేషన్లలోని ఎస్హెచ్ఓ ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. సమస్య ఉత్పన్నమైతే డైల్ 100కు ఫోన్ చేసి తక్షణమే సహాయం పొందాలని సూచించారు.

జిల్లా లో రెడ్ అలెర్ట్

- Advertisement -

:ఈ రోజు నుండి రెడ్ అలెర్ట్ అని , 7 లోతట్టు ప్రాంతాల్లో రోడ్లు మూత పడ్డాయని,మరో 15 మార్గాల్లో చప్టాలు నీట మునుగుతాయని ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దని జిల్లాకలెక్టర్ ప్రియాంక, జిల్లా ఎస్పీ వినీత్ కోరారు.

“.2వేల చెరువుల్లో 1035 ఇప్పటికే నిండాయి రెండు రోజుల్లో మరో 500 చెరువులు నిండి పొంగి పొర్లుతాయి. వర్షం, గోదావరి వరద వల్ల కొన్ని గ్రామాల్లోకి నీరు చేరుతుంది. ఆయా గ్రామాల్లో అన్ని జాగ్రత్తలు తీసుకున్నాం. 23 మండలాల్లో అత్యవసరం ఉంటే తప్ప బయట కు రావద్దు. ప్రతి గ్రామం లో ఆరోగ్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శి అందుబాటులో ఉంటారు. జిల్లా యంత్రాంగానికి సహకరించాలి. ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావద్దు. అత్యవసరం ఉంటే కంట్రోల్ రూమ్ కు కాల్ చేయాలని ” కలెక్టర్ ప్రియాంక తెలిపారు.

ఎస్పీ వినీత్.జి మాట్లాడుతూ పోలీస్ యంత్రాంగం 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. గోదావరికీ రెండో ప్రమాద హెచ్చరిక అమల్లో ఉందన్నారు. 2 ఎన్ డి ఆర్ ఎఫ్ టీం లు అందుబాటులో ఉన్నాయన్నారు. ఒకటి దుమ్ముగూడెం ఉంది, చర్ల లో 40 కుటుంబాలను రెస్క్యూ చేసి, పునరావాస కేంద్రం లో ఉంచామన్నారు. మరి కొన్ని గ్రామాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నామన్నారు. పోలీస్యంత్రాంగం నిరంతరం రెస్క్యూ కు అందుబాటులో ఉంటుందాన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement