Saturday, June 15, 2024

TS : దేవుడిపై ఒట్లు వేస్తే …రైతుల‌కు న్యాయం జ‌ర‌గ‌దు…. కేంద్ర‌మంత్రి కిష‌న్‌రెడ్డి

45 రోజులు గడుస్తున్న కొనుగోలు ప్రక్రియ పూర్తికాక పోవడం.. కొనుగోలు ప్రక్రియ నత్తనడకన కొనసాగుతుండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి. యాదాద్రి జిల్లాలోని బీబీనగర్ మండలం రాఘవపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పరిశీలించారు. కొనుగోలు ఆలస్యం కావడానికి గల కారణాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

- Advertisement -

ఈ సంద‌ర్భంగా కొనుగోలు ప్రక్రియ ఆలస్యం అవుతుందని కిషన్ రెడ్డి దగ్గర రైతులు మొర పెట్టుకున్నారు. ఎప్పటికీ కొనుగోలు పూర్తి అవుతుందో తెలియడం లేదని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ కొనుగోలు ప్రక్రియలో ప్రతి దశకు కేంద్రం డబ్బులు చెల్లిస్తుంద‌ని, .. అయినా కొనుగోలు సరిగ్గా జరగడం లేదని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల కక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందని మండిప‌డ్డారు కిష‌న్ రెడ్డి. సీఎంకు రైతులకంటే ఎన్నికలే ముఖ్యంగా మారింది అని ఆరోపించారు. మాజీ సిఎం కేసీఆర్ గ‌తంలొ వరి వేస్తే ఊరి అన్నార‌ని , ఇప్పుడ సిఎం రేవంత్ రెడ్డి దొడ్డు వడ్లు వేస్తే బొనస్ ఇవ్వము అంటున్నార‌ని అన్నారు. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదన్నారు. దేవుడి మీదు ఒట్టు పెడితే రైతుకు న్యాయం జరగద‌ని రేవంత్ కు చుర‌క‌లు అంటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement