Sunday, April 28, 2024

GO Released – కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి వంద ఎక‌రాల భూమి కేటాయింపు…

హైద‌రాబాద్ – కొత్త హైకోర్టు భవన నిర్మాణానికి తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. హైకోర్టు నిర్మాణానికి 100 ఎకరాల భూమిని కేటాయిస్తూ శుక్రవారం జీవోను విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ప్రేమావతిపేట్‌, బుద్వేల్‌ గ్రామ పరిధిలోని 100 ఎకరాలను న్యాయశాఖకు కేటాయిస్తున్నట్లు జీవో నెంబర్ 55లో పేర్కొంది. బుద్వేల్‌లోని 2500 ఎకరాలను వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయానికి 1966లో అప్పటి ప్రభుత్వం కేటాయించింది. ఆ భూమిలోని 100 ఎకరాలను హైకోర్టు భవనానికి కేటాయించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ స్థలంలో నూతన హైకోర్టు భవన నిర్మాణం జరిగే వరకు హైకోర్టు కార్యకలాపాలు అన్నీ పాత భవనంలోనే జరుగుతాయి. ఆ తర్వాత దానిని వారసత్వ కట్టడంగా పరిరక్షించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement