Friday, April 26, 2024

“గ్లోరియస్ వ్యూ ఆఫ్ హైదరాబాద్”

హైదరాబాద్ – తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మిస్తున్న సచివాలయం భవనానికి సంబంధించిన ఫొటోలను మంత్రి కేటీఆర్‌ తన ట్విటర్‌ అంకౌంట్‌ ద్వారా పంచుకున్నారు. తుది దశలో ఉన్న సచివాలయం, అమరవీరుల స్మారకం చిత్రాన్ని “గ్లోరియస్ వ్యూ ఆఫ్ హైదరాబాద్” అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.

సాయంత్రం వేళ సూర్యుని కాంతి ఓ వైపు.. విద్యుత్ దీపాలతో మరోవైపు వెలుగుతున్న రెండు ప్రతిష్టాత్మక నిర్మాణాల చిత్రాన్ని ఆయన ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. చిత్రంలో ప్రత్యేకించి అమరవీరల స్మారకం స్టెయిన్ లెస్ స్టీల్ క్లాడింగ్‌పై సూర్యుని కాంతి వెలుగుల్లో మేఘాలు ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. తెలంగాణ అమరవీరుల స్మారకం, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయాన్ని త్వరలో ప్రారంభించనున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement