Thursday, May 2, 2024

HYD : మరొకసారి అవకాశం ఇవ్వండి నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా అభివృద్ధి చేస్తా… ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

కర్మన్ ఘాట్, నవంబర్ 11( ప్రభ న్యూస్) మరొకసారి అవకాశం కల్పిస్తే నియోజకవర్గాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతానని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి,ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శనివారం లింగోజిగూడా డివిజన్ మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు చే కలిసి సరూర్ నగర్ ప్రియదర్శిని పార్క్ నందు వాకర్స్ ను కలవడం జరిగింది.ఈ సందర్భంగా వాకర్స్ సభ్యులు సుధీర్ రెడ్డి కి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుందని హామీ ఇచ్చారు.ప్రస్తుతం పార్క్ యొక్క స్వరూపం పూర్తిగా మారింది అని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో మా యొక్క మద్దతు ఉంటుంది అని హామీ ఇచ్చారు.అనంతరం సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ప్రియదర్శిని పార్క్ 2007 వ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది అని గుర్తు చేశారు.అంతకు ముందు ఇట్టి పార్క్ పూర్తిగా బురదామయంగా ఉండేది అని తెలిపారు.నేను రెండవ సారి ఎమ్మెల్యేగా అయినప్పటికీ తరువాత నియోజకవర్గ పరిధిలో పార్కుల అభివృద్ధి విషయంలో పార్కుల యొక్క స్వరూపం మార్చడం జరిగింది అని తెలిపారు. ప్రియదర్శిని పార్క్ నందు ప్రస్తుతం పూర్తి స్వరూపం మార్చడం జరిగింది అని గుర్తు చేశారు.పర్యాటకులు పార్కుకు రావడానికి ఇట్టి పార్క్ ప్రవేశ ద్వారం నందు ఒక అందమైన నెమలి ఆకారం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. పర్యాటకులు కూర్చోవడానికి గజీబులు,ఓపెన్ జిమ్స్,యోగ చేసుకోవడానికి యోగ సెంటర్,అత్యాధునిక మూత్రశాలలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పార్క్ నందు మొక్కలు ఎండకుండా మరొక బోరు కూడా వేయించడం జరిగింది అని తెలిపారు.నియోజకవర్గ పరిధిలోని అన్ని పార్కుల్లో ఓపెన్ జిమ్స్ కూడా ఎర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సరూర్ నగర్ చెరువును రాబోయే రోజుల్లో సుందరికారణ చేసి అందులో చిన్న చిన్న పడవలతో బోటింగ్ ఎర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. నియోజకవర్గ పరిధిలోని ప్రధాన సమస్యలు ఒక్కొక్కటిగా పరిష్కారం చేయడం జరుగుతుందని అని తెలిపారు. మరొక్కమారు నాకు అవకాశం ఇవ్వండినియోజకవర్గన్నీ అభివృద్ధి విషయంలో నెంబర్ వన్ గా నిలబెట్టడం జరుగుతుంది అని తెలిపారు.కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి మీ యొక్క సహాయసహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోయిని మహేందర్ యాదవ్,రవి,భాస్కర్ గంగపుత్ర,తిలక్,సత్యం,జై శంకర్,అశోక్ మరియు పలువురు వాకర్స్ పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement