Sunday, April 28, 2024

ఘ‌నంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి.. జన్మదిన వేడుక‌లు

వికారాబాద్ ( ప్రభ న్యూస్):వికారాబాద్ లో ప్రారంభమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతి ఉత్సవాలు ఆదివారం ఘ‌నంగా జరిగాయి. ఈ కార్య‌క్ర‌మంలో తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చైర్మన్స్ ఛాంబర్ వైస్ చైర్ పర్సన్ .. వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ పాల్గొన్నారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జన్మదినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ ఏడాది కూడా శ్రీ రామ మందిరంలో అమ్మవారి సన్నిధానం నందు అమ్మవారి జయంతి ఉత్సవాలు ఈరోజు ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ జయంతి ఉత్సవాలలో వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాతభేరి, సుప్రభాత సేవ, మహా అభిషేకం, అలంకార సేవ, ఆర్యవైశ్య భవనం నుండి శ్రీరామ మందిరం వరకు నిర్వహించిన కలశాల ఊరేగింపులో చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ గారు మహిళలతో కలిసి పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ చిగుళ్లపల్లి రమేష్ వికారాబాద్ పట్టణ బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు శిరీష తదితరులు పాల్గొన్నారు. ఈ పూజ కార్యక్రమంలో ఆర్యవైశ్య పెద్దలు, ఆర్యవైశ్య సంఘం నాయకులు, ఆర్యవైశ్య మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement