Thursday, November 7, 2024

TS: అంతరాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్..

షాద్ నగర్, మార్చి 26 ప్రభ న్యూస్ : రహదారులకు సమీపంలో ఉన్న ఇండ్లే వారి టార్గెట్.. ఇంటికి తాళం కనిపించిందో ఇక అంతే సంగతి, పగలంతా రెక్కీలు నిర్వహించి రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతూ, అదేవిధంగా చైన్ స్నాచింగ్ చేస్తూ దొరికిందంతా దోచుకుంటున్న మహారాష్ట్ర గ్యాంగ్ ను ఎట్టకేలకు రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ ఆవరణలో మంగళవారం స్థానిక ఏసీపీ రంగస్వామి పర్యవేక్షణలో మీడియా సమావేశం నిర్వహించారు. మహారాష్ట్ర గ్యాంగ్ చేసిన 23 దొంగతనాలకు సంబంధించిన పలు పోలీస్ స్టేషన్లలో నమోదైన కేసుల వివరాలను మీడియా ముందు పెట్టారు.

షాద్ నగర్, ఆమన్ గల్, కడ్తాల్, శంషాబాద్, కొత్తూరు, కేశంపేట, నందిగామ, పహాడి షరీఫ్, మహేశ్వరం, కందుకూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన నిందితులు మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా వైజాపూర్ గ్రామానికి చెందిన ప్రధాన నిందితుడు రాజీవ్ శంకర్ పవర్, అదేవిధంగా నాగపూర్ కు చెందిన అజయ్ సర్కస్ పవర్, తుల్జాపూర్ గ్రామానికి చెందిన అమూల్ అలియాస్ షిండే, అలాగే మహారాష్ట్రలోని వైజపూర్ తాలూకా గొల్వడి గ్రామానికి చెందిన పవన్ మచీంద్ర, నాగపూర్ గ్రామానికి చెందిన ఎల్వాతిలు అంతరాష్ట్ర దొంగల ముఠాగా ఏర్పడి 23 చోరీలకు పాల్పడ్డారు. రంగారెడ్డి జిల్లాలోని షాద్ నగర్, ఆమన్ గల్, కడ్తాల్, శంషాబాద్, కొత్తూరు, కేశంపేట, నందిగామ, పహాడి షరీఫ్, మహేశ్వరం, కందుకూర్ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడగా పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు చేశారు.

షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదు దొంగతనాలు చేయగా, కొత్తూరులో ఒకటి, కడ్తాల్ మండలంలో రెండు, మహేశ్వరం మండలంలో రెండు, కందుకూర్ మండలంలో రెండు, నందిగామ మండలంలో ఒకటి, కేశంపేట పరిధిలో ఒకటి, శంషాబాద్ పరిధిలో మూడు, ఆమన్గల్ పరిధిలో నాలుగు దొంగతనాలు చేశారని శంషాబాద్ డిసిపి నారాయణరెడ్డి కేసులతో సహా మీడియా ముందు వివరించారు. వీరిపై ఆయా పోలీస్ స్టేషన్లలో 23 కేసులు నమోదై ఉన్నాయని వివరించారు. ఇందులో ఇద్దరిని ఈనెల 14న సాంకేతిక సాక్షాదారాలతో సహా అదుపులోకి తీసుకున్నట్టు డీసీపీ వివరించారు. రాజీవ్ శంకర్ పవర్, పవన్ మచ్చింద్ర ఇద్దరిని అదుపులోకి తీసుకొని 30 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. 23 కేసుల్లో బాధితులకు వారికి సంబంధించిన బంగారు ఆభరణాలను కోర్టు ద్వారా అందజేస్తామని డిసిపి వివరించారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement