Friday, May 3, 2024

గాంధీలో గ్యాంగ్ రేప్.. ఎవరూ తమకు ఫిర్యాదు చేయలేదన్న సూపరింటెండెంట్

గాంధీ ఆస్పత్రిలో గ్యాంగ్ రేప్ ఘటన సంచలనం రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే నిందితులని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. అత్యాచార ఘటనపై అక్కడి వైద్య సిబ్బందిని ఆరా తీశారు. ఆస్పత్రి వైద్యాధికారి రాజారావుని వివరణ కోరారు.

మరోవైపు ఈ ఘటనపై తమకు ఎవరూ ఫిర్యాదు చేయలేదని ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆస్పత్రిలో అధికారులతో కమిటీ వేశానన్నారు. దీనికి సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్టు చేశారని, విచారణ జరుగుతోందని చెప్పారు. బాధితులకు మత్తుమందు ఇచ్చి, మూడు రోజులు రూంలో ఉంచడం.. ఇటువంటి పరిస్థితులు గాంధీ ఆస్పత్రిలో లేవన్నారు. ఆస్పత్రిలో సీసీ కెమెరాలు పనిచేస్తున్నాయని చెప్పారు. అత్యాచారం సెల్లార్‌లో జరిగే అవకాశమే లేదని, అక్కడ క్యాంటిన్, మెడికల్ స్టోర్, దోబీఘాట్ ఉన్నాయని వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement