Monday, April 29, 2024

Deputy CM: గ‌ద్ద‌ర్ ఇంటికి భ‌ట్టి… కుటుంబానికి ప‌రామ‌ర్శ‌..

సికింద్రాబాద్ వెంకటాపురంలోని మహాబోధి విద్యాలయం ఆవరణలో ఉన్న ప్రజా యుద్ధ నౌక గద్దర్ సమాధి వద్ద డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం హోదాలో భ‌ట్టి విక్ర‌మార్క తొలిసారిగా ప్రజా యుద్ధనౌక గద్దర్ నివాసానికి వెళ్లి గద్దర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

భట్టి విక్రమార్కను చూసి కంట తడి పెట్టుకొని భావోద్వేగానికి గురయ్యారు గద్దర్ భార్య గుమ్మడి విమల. గద్దర్ భార్య విమలను ఓదార్చి గద్దర్ అన్న కుటుంబానికి మేమంతా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. పొడుస్తున్న పొద్దుతో.. నడుస్తున్న కాలంతో ప్రజా ఉద్యమాన్ని ఆహింసాయుతంగా నడిపి ప్రజల త్యాగాలను కేంద్రానికి నివేదించి అప్పటి కేంద్ర ప్రభుత్వ పెద్దమ్మ అయిన సోనియమ్మను ఒప్పించడంలో కీలక పాత్ర వహించి తెలంగాణ రాష్ట్ర సాధనలో అగ్ర భాగాన నిలిచారని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement