Tuesday, January 14, 2025

Medak: చెరువులో బట్టలుతికేందుకు వెళ్లి నలుగురు మృతి

మనోహరాబాద్, ప్రభ న్యూస్ : బట్టలు ఉతకడానికి వెళ్లి చెరువులో పడి నలుగురు శవమై తేలిన సంఘటన మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగాయి పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగయ్యపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య ఇంటికి బోనాల జాతర కోసం అంబర్పేట నుండి సమీప బంధువులు లక్ష్మీ (30) బాలమణి (30) బాలమణి కుమారుడు చరణ్ (6) లు వచ్చారు.

దీంతో ఇవాళ ఉదయం ఈ ముగ్గురితో పాటు చంద్రయ్య కూతురు లావణ్య (19) చెరువులో బట్టలు ఉతకడం కోసం వెళ్లగా… మొదట బాలుడు చరణ్ చెరువులో ప్రమాదవశాత్తు కాలుజారి పడటంతో బాలుని రక్షించడానికి ఒకరి వెనుక మరొకరు వెళ్ళగా ఈ ముగ్గురు మృతి చెందారు. బాలుడు చరణ్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement