Sunday, April 28, 2024

TS : మాజీ ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్ట్..

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ డీఎస్పీ డి.ప్రణీత్ రావును రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్‌లో పంజాగుట్ట పోలీసులు అరెస్టు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌ కార్యాలయంలో నిఘా కెమెరాలు పని చేయకుండా చేసి ఆఫీసులోని హార్డ్ డిస్క్‌లు ధ్వంసం చేసిన కేసులో ప్రణీత్‌రావు కీలక నిందితుడి ఉన్నారు.

అయితే, ఇటీవలే అధికారంలోకి వచ్చిన సర్కార్ ఆయనను విధుల నుంచి సస్పెండ్‌ చేసింది. అదేవిధంగా ప్రణీత్‌రావుతో పాటు ఈ కేసులో సంబంధమున్న ఇతరులపై చర్యలు చేపట్టాలని అడిషనల్ ఎస్పీ రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఆయనపై ఐపీసీ 409, 427, 201తో పాటు ఐటీ ఆక్ట్ సెక్షన్ 65, 66, 70 ప్రకారం పోలీసులు పలు కేసు నమోదు చేశారు.

- Advertisement -

కాగా, ప్రణీత్ రావు విచారణలో పోలీలసులకు కళ్లు బైర్లు కమ్మే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి సస్పెండ్ అయిన డీఎస్పీ ప్రణీత్‌రావు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్‌ కార్యాలయం నుంచి దాదాపు 42 హార్డ్ డిస్క్‌లను మాయం చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. అదేవిధంగా 1,610 పేజీల కాల్ డేటాను సైతం కాలబెట్టినట్లుగా నిర్ధారించారు. ఇక కీలకమైన ఎస్ఓటి లాకర్ రూంలోని ఫైల్స్, ఓ కీలక నేత ఫోన్ ట్యాపింగ్ డేటాతో పాటు కాల్ రికార్డులు కొన్ని ఐఎంఈఐ నెంబర్లతో పాటు ఐపీడీఆర్ డేటాని కూడా ట్రాష్ చేసినట్లుగా విచారణలో వెల్లడైంది. అదేవిధంగా ఈ కేసుకు సంబంధం ఉన్న అప్పటి ప్రభుత్వ పెద్దల పేర్లు కూడా త్వరలో బయటకొచ్చే ఛాన్స్ ఉందని జోరుగా చర్చ జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement