Sunday, April 28, 2024

TS: మెదక్ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే డ్రైవర్ ఆత్మహత్య..

కుటుంబ కలహాలతో మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవర్ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ పట్టణంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు చిన్న శంకరం పేట మండలం గవ్వల పల్లికి చెందిన శివ రాములు (42) మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డీ వద్ద డ్రైవర్‌గా పనిచేశాడు. భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి మెదక్ పట్టణంలోని డబుల్ బెడ్ రూమ్ పిల్లి కొట్టాల్ వద్ద ఉంటున్నాడు.

కాగా భార్యభర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.. భార్య ఇంటి వద్ద లేని సమయంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఉదయం కుమారుడు లేచి చూస్తే ఫ్యాన్‌కు వేలాడుతున్న శివరాములు మృతదేహం ఉంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని శవాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement