Sunday, April 28, 2024

TS: బీఆర్ఎస్ కు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా..

తెలంగాణ రాష్ట్రంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి బీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు. ఈ రోజు ఆయన రాజీనామా చేసి ఆ లేఖను గులాబీ దళపతి కేసీఆర్‌కు పంపారు. రెండు దశాబ్దాల కాలంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రిగా, శాసనసభ్యుడిగా తనదైన శైలిలో రాజకీయం చేసిన పెద్దిరెడ్డి హఠాత్తుగా రాజీనామా చేయడం కలకలం రేపింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు పెద్దిరెడ్డి రాజీనామా చేయడం బీఆర్ఎస్ పార్టీకి పెద్ద షాక్ తగిలినట్టయింది.

రాజీనామా అనంతరం పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… తాను టీఆర్ఎస్ పార్టీలో చేరడం పెద్ద తప్పిదమని, ఉమ్మడి జిల్లాలో మంత్రిగా పనిచేసిన తనకు కేసీఆర్ ఏనాడు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. సోమవారం కరీంనగర్ లో జరిగిన సమావేశంలో కేసీఆర్ తనకు ప్రాధాన్యత ఇవ్వలేకపోవడం మనసు కలచివేసిందని, అంతకు ముందు తాను బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు ఎంతో కృషి చేశారని తెలిపారు. హుజరాబాద్‌లో కౌశిక్ రెడ్డి గెలుపునకు తన వంతు పాత్ర పోషించానని అయినా కేసీఆర్ తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని, దీంతో మనసు చెదిరి పార్టీకి రాజీనామా చేసినట్లు చెప్పారు. భవిష్యత్తు కార్యాచరణపై తాను కార్యకర్తలతో, అభిమానులతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement