Monday, May 20, 2024

Kidnap – సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ లో అయిదేళ్ల బాలుడు కిడ్నాప్….

హైదరాబాద్‌ నగరంలో బెగ్గింగ్‌ మాఫియా రెచ్చిపోతుంది. ఒంటరిగా కనిపిస్తున్న పిల్లలే టార్గెట్‌గా కిడ్నాప్‌ చేసి యాచక వృత్తిలోకి దింపుతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో యిదేళ్ల బాలుడు కిడ్నప్‌కు గురయ్యాడు. కిడ్నాప్‌ చేసిన వారిని బెగ్గింగ్ మాఫియా ముఠాగా అనుమానిస్తున్నారు.

వివ‌రాల‌లోకి వెళితే మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం రాయాలపురానికి చెందిన దుర్గేశ్, తన 5 ఏళ్ల కుమారుడి శివ సాయితో కలిసి తిరుమల వెళ్ళాడు. ఈనెల 28న తిరిగి హైదరాబాద్ చేరుకున్నాడు. ఆ రోజు ఉదయం 5.30కు సికింద్రాబాద్ స్టేషన్‌లో దిగిన దుర్గేశ్‌.. అలిసిపోయి ఉండటంతో స్టేషన్‌లోనే పడుకున్నాడు. అనంతరం సాయంత్రం 4.30కు దుర్గేశ్ తన కుమారుడిని బ్యాగులతో పాటు ప్లాట్ ఫామ్ నెంబర్ 1 వద్ద ఉంచి వాష్‌రూం వెళ్లాడు. వచ్చి చూసేలోపు బాబు కనిపించలేదు. దీంతో స్టేషన్‌లో ఉన్న జీఆర్‌పీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా గుర్తు తెలియని దంపతులు బాబును కిడ్నాప్ చేసి తీసుకువెళ్తున్నట్లు గుర్తించారు. ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు. అయితే తప్పిపోయిన బాలుడు.. మూగ, చెవిటి అని తండ్రి దుర్గేశ్ చెబుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement