Wednesday, May 1, 2024

Fire Brand – మోడీ,అమిత్ షాలు మాట‌లే చెబుతారు…చేత‌లే శూన్యం – విజ‌య‌శాంతి

హైద‌రాబాద్ -బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని అన్నారు మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత విజయశాంతి. సీఎం కేసీఆర్ అవినీతిపై ఆధారాలున్న ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రధాని మోడీని ప్రశ్నించారు. అవినీతికి పాల్ప‌డ్డ‌వారిని వ‌ద‌లబోమ‌న్న బిజెపి మాట‌లు బిఆర్ఎస్ విష‌యంలో నీటి మాట‌ల‌య్యాయ‌ని విమ‌ర్శించారు.. కాంగ్రెస్ పార్టీలోకి వ‌చ్చిన విజ‌య‌శాంతి తొలిసారిగా గాంధీభ‌వ‌న్ వేదిక‌గా మీడియాతో మాట్లాడుతూ, ఇటు కెసిఆర్ పైనా, అటు మోడీ, అమిత్ షాల‌పైనా విరుచుకుపడ్డారు.. బిజెపి,బిఆర్ఎస్ పార్టీలు తెర ముందు విమర్శలు, తెర వెనక ఒప్పందాలు చేసుకున్నాయని ఆరోపించారు. మధ్యలో బీజేపీ కార్యకర్తలు, ప్రజలు పిచ్చోళ్లని అన్నారు. కేసీఆర్ సూచన మేరకే బీజేపీ అధ్యక్షుడు బండి సంజ‌య్ మార్చార‌ని, ఈ మార్పు వ‌ల్ల తెలంగాణ‌లో క‌మ‌లం పార్టీ ప‌రువు మొత్తం కాళేశ్వ‌రంలో క‌లిసిపోయిందంటూ ఎద్దేవా చేశారు. అధ్య‌క్షుడిని మార్చ‌డం వ‌ల్ల‌, కెసిఆర్ పై ఎటువంటి చ‌ర్య‌లు బిజెపి అగ్ర‌నేత‌లు ఎటువంటి చ‌ర్య‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్లే తాను బీజేపీకి రాజీనామా చేశానని చెప్పారు విజయశాంతి.

బిజెపి బీఆర్ఎస్ లు రెండు ఒకటే…వీరు తెర ముందు ఒకరకంగా తెర వెనుక ఒకరకంగా మాట్లాడుతుంటార‌న్నారు. గత నాలుగు నెలలుగా బిజెపిలో మౌనంగా ఉన్నాన‌ని, . ఇక అక్కడ ఉండలేక రాజీనామా చేసి కాంగ్రెస్ లోకి చేరాన‌న్నారు.. తన రాష్ట్రమే తనకు ముఖ్యమని అనుకోని రాజకీయాల్లో ఉన్నానని అన్నారు విజయశాంతి. కేసీఆర్ ను ఎదురించడానికి బీజేపీలోకి వెళ్ళానని చెప్పిన ఆమె..ఆ తర్వాత కేసీఆర్ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో మెల్లగా అర్ధమైందన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా, నడ్డా తెలంగాణకు వచ్చినప్పుడు విమర్శలు చేయడం వదిలేయడం ఇదో తంతుగా మారిందన్నారు. దీనిపై మాట్లాడుతుంటే నా మీద ఘాటైన హెడ్డింగ్స్ పెట్టించార‌ని వాపోయారు.. నా మీద కొంతమంది లీడర్లు అసభ్యంగా మాట్లాడారన్నారు. వారు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిద‌ని అంటూ త‌న‌ గురువు అద్వానీ విలువైన రాజకీయాలు చెప్పార‌న్నారు. కానీ, ఇప్పటి బిజెపి నేతలకు అలాంటి విలువలు లేవ‌ని అన్నారు.. బిజెపి త‌న‌ను మోసం చేసింద‌ని విజ‌య‌శాంతి పేర్కొన్నారు..
ఇక తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెప్పిన విజయశాంతి.. కేసీఆర్ అవినీతిని కక్కిస్తుందన్నారు. కాంగ్రెస్ లో తన పాత మిత్రులను కలుసుకోవడం అనందంగా ఉందన్నారు. బీఆర్ఎస్ ను గద్దెదించే పార్టీతోనే తాను నడుస్తానన్నారు. రాష్ట్రంలో, కేంద్రంలో అధికార మార్పు జరుగుతుందని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement