Tuesday, October 8, 2024

Final List – 14 మందితో బిజెపి తుది జాబితా విడుద‌ల …

హైద‌రాబాద్ – తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ.. 14 మందితో తుది జాబితాని విడుదల చేసింది. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో… బీజేపీ ఇప్పుడు ఈ జాబితాను రిలీజ్ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. ఈలోగా అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో 119 అసెంబ్లీ స్థానాలు ఉండగా… బీజేపీ, జనసేనకు 8 సీట్లను ఇచ్చింది. మిగతా 111 స్థానాల్లో బీజేపీ నేతలు బరిలో దిగుతున్నారు.

1. బెల్లంపల్లి: కోయెల ఎమాజీ
2. పెద్దపల్లి: దుగ్యాల ప్రదీప్
3. సంగారెడ్డి: డి.రాజేశ్వర్ రావు
4. మేడ్చల్: ఏనుగు సుదర్శన్ రెడ్డి
5. మల్కాజ్‌గిరి: రామచంద్రారావు
6. శేరిలింగంపల్లి: రవికుమార్ యాదవ్
7. నాంపల్లి: రాహుల్ చంద్రా
8. కంటోన్మెంట్: గణేష్ నారాయణ్
9. దేవరకద్ర: కొండ ప్రశాంత్ రెడ్డి
10. నర్సంపేట్: పుల్లారావు
11. వనపర్తి: అనూగ్నా రెడ్డి
12. అలంపూర్: మీరమ్మ
13. చంద్రాయణ గుట్ట: కే.మహేందర్
14. మధిర: విజయరాజు

Advertisement

తాజా వార్తలు

Advertisement