Sunday, April 14, 2024

BSP : 21 మందితో బీఎస్పీ ఫైన‌ల్ లిస్టు విడుద‌ల

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీఎస్పీ 21 మందితో ఫైన‌ల్ జాబితాని విడుదల చేసింది. నామినేషన్లకు ఇవాళే చివరి రోజు కావడంతో… బీఎస్పీ ఇప్పుడు ఈ జాబితాను రిలీజ్ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ముగుస్తుంది. ఈలోగా అభ్యర్థులు తమ నామినేషన్లు సమర్పించాల్సి ఉంటుంది. ..

ఫైన‌ల్ జాబితాలో నిర్మల్ – డి.జగన్ మోహన్, బోధన్ – ఎ. అమర్ నాథ్ బాబు, బాన్స్ వాడ – నీరడి ఈశ్వర, ఎల్లారెడ్డి – జమున రాథోడ్, సిద్దిపేట్ – డి. చక్రాధర్ గౌడ్, గజ్వేల్ – జక్కని సంజయ్, మల్కాజిగిరి – రత్నాకర్ పాండు, ముషీరాబాద్- పోచగిరి నరేందర్, జూబ్లీహిల్స్- కోనేటి సుజాత రాములు, సనత్ నగర్ – ఎండి సలీం, యాకుత్ పుర – బంగారి మాణిక్యం, బహదూర్ పుర – కే. ప్రసన్న కుమారి యాదవ్, సికింద్రాబాద్ – రుద్రవరం సునీల్, నాగార్జునసాగర్ – రమణ ముదిరాజ్, మిర్యాలగూడ –  డా.జాడి రాజు, భువనగిరి – ఉప్పల జహంగీర్, తుంగతుర్తి – బొడ్డు కిరణ్ , ఆలేరు – డప్పు వీరస్వామి, జనగాం- తూడి విజయ్ కుమార్, ఇల్లందు- బి.ప్రతాప్ నాయక్ , పటాన్ చెరు – నీలం మధు ముదిరాజ్ లకు సీట్లు లభించాయి.

L.

Advertisement

తాజా వార్తలు

Advertisement