Wednesday, May 1, 2024

KTR : ఆనంద్ మహీంద్రా ట్వీట్‌…కేటీఆర్ రిప్లై 

గూగుల్ క్యాంపస్ నిర్మాణపనులు జరగుతున్న వీడియోను ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా రీట్వీట్ చేస్తూ ఈ ప్రాజెక్టు విశిష్టతను పేర్కొన్నారు. ‘‘ఇది ఓ బిల్డింగ్‌కు సంబంధించిన వార్త కాదు. దీని ప్రాముఖ్యత పూర్తిగా అర్థమయ్యేలా నేను వార్తను వీలైనంత సావకాశంగా చదివా. గూగుల్ లాంటి అంతర్జాతీయ దిగ్గజం అమెరికా ఆవల అతిపెద్ద క్యాంపస్ నిర్మించేందుకు ఓ దేశాన్ని ఎంపిక చేసిందంటే ఇదే కేవలం వాణిజ్య వార్త కాదు. భౌగోళికరాజకీయ ప్రాధాన్యమున్న వార్త’’ అని ఆనంద్ మహీంద్రా కామెంట్ చేశారు.

అయితే, హైదరాబాద్ గొప్పదనాన్ని చాటి చెప్పేందుకు ఏ అవకాశాన్నీ వదులుకోని మంత్రి కేటీఆర్ ఆనంద్ మహీంద్రాకు రిప్లై ఇచ్చారు. ‘‘ఆనంద్ జీ.. మీకు ఈ విషయం తెలుసా? ప్రపంచంలోనే అతిపెద్ద అమెజాన్ క్యాంపస్‌కూడా హైదరాబాద్‌లోనే ఉంది. అంతేకాదు, యాపిల్, మెటా, క్వాల్‌కామ్, మైక్రాన్, నోవార్టిస్, మెడ్‌ట్రానిక్, ఊబెర్, సేల్స్‌ఫోర్స్ వంటి ఎన్నో సంస్థలు గత తొమ్మిదేళ్లల్లో తమ భారీ క్యాంపస్‌లు హైదరాబాద్‌లో ఏర్పాటు చేసుకున్నాయి. అందుకే..#HappeningHyderabad అని మేమనేది. అమెజాన్ క్యాంపస్‌ను ఫొటోను కూడా అటాచ్ చేశాను చూడండి’’ అంటూ రిప్లై ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement