Thursday, May 2, 2024

బస్తీ, పల్లె దవాఖానాల్లో ఎంఎల్‌హెచ్‌పీ ఖాళీల భర్తీ.. మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : బస్తీ, పల్లె దవాఖానాల్లో ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల నియామకాలకు మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. పురపాలక సంఘాల పరిధిలోని సబ్‌ సెంటర్ల (బస్తీ దవాఖానాలు)లో , పల్లె దవాఖానాల్లో ‘ మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌’ (ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి శుక్రవారం జీవో విడుదల చేశారు. బస్తీ దవాఖానాల్లో ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌ పూర్తి చేసిన వారు మాత్రమే ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు అర్హులని పేర్కొన్నారు. బస్తీ, పల్లె దవాఖానాల్లో ఎంఎల్‌హెచ్‌పీల ను నియమించాలన్న రాష్ట్ర కుటుంబ ఆరోగ్యశాఖ కమిషనర్‌ నివేదిక మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

ఎంబీబీఎస్‌ చేసిన వారికి తాజాగా భర్తీ చేసే ఎంఎల్‌హెచ్‌పీ పోస్టుల్లో ప్రాధాన్యత దక్కనుంది. పల్లె దవాఖానాల్లో (సబ్‌ సెంటర్లు) ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌తోపాటు స్టాఫ్‌ నర్సులు ఈ ఎంఎల్‌హెచ్‌పీ పోస్టులకు అర్హులు. బీఎస్సీ నర్సింగ్‌ 2020 తర్వాత పూర్తి చేసిన వారు లేదా 2020కి ముందు బీఎస్సీ నర్సింగ్‌/జీఎన్‌ఎం పూర్తి చేసి ఆరు నెలల కమ్యూనిటీ హెల్త్‌ బ్రిడ్జి కోర్సు పూర్తి చేసిన వారు అర్హులు. డాక్టర్లకు రూ.40వేలు, స్టాఫ్‌ నర్సుకు రూ.29, 900 గౌరవ వేతనం చెల్లించనున్నారు. ఈ విషయంలో తదుపరి చర్యలను తీసుకునే అధికారాన్ని రాష్ట్ర కుటుంబ, ఆరోగ్యశాఖ కమిషనర్‌కు అప్పగించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement