Friday, May 3, 2024

TS: హామీలు నెరవేర్చకపోతే పోరాటం.. ఎమ్మెల్యే గంగుల‌

ప్రభుత్వం రైతులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాలని, లేకపోతే రైతుల పక్షాన నిలబడి పోరాటం చేస్తామని కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ తెలియజేశారు. శనివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుమేరకు కరీంనగర్ లోని ఎమ్మెల్యే నివాసంలో నిరసన దీక్ష చేపట్టారు. అనంతరం మాట్లాడుతూ… రైతులకు వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేయాలని, వెంటనే రైతుబంధు నిధులు కర్షకుల ఖాతాల్లో జమ చేయాలని, కౌలు రైతులకు హామీ ఇచ్చిన విధంగా నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా ధాన్యానికి మద్దతు ధర అందించడంతో పాటు 500 రూపాయల బోనస్ చెల్లించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలన వల్ల రైతులు సాగునీరు అందక పంట నష్టపోయారన్నారు. పంట నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం అందించాలన్నారు. దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు గడిచినా హామీలు పూర్తి చేయని కాంగ్రెస్ కు పార్లమెంటు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement