Monday, April 29, 2024

MBNR: నష్ట పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలి.. కలెక్టర్ కు ఎమ్మెల్యేల‌ వినతి..

గద్వాల ప్రతినిధి, ఏప్రిల్ 2 (ప్రభ న్యూస్) : కరువు నెలకొన్న గ్రామాల్లో పంట నష్టం వివరాలు సేకరించడం, పంటలకు మద్దతు ధరకు అదనంగా క్వింటాల్ కు 500 రూపాయలు చెల్లించాలని మంగళవారం రోజు గద్వాల జిల్లా కేంద్రంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ బి.సంతోష్ కి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు మర్యాదపూర్వకంగా కలిసి సాగునీరు లేక ఎండిపోయిన పంట పొలాలకు, రైతులకు నష్టపరిహారం, పంటకు మద్దతు ధర క్వింటాలకు 500 రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం తరఫున రైతులను ఆదుకోవాలని కోరారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జిల్లాలో అనేక గ్రామాల్లో పంటలకు నీరందక ఎండిపోతున్నాయని, చేతికొచ్చే దశలో పంటలు నష్టపోవడం రైతాంగానికి ఆందోళన కలిగిస్తుందన్నారు. వెంటనే గ్రామాల వారీగా పంటల నష్టాన్ని అంచనా వేయడానికి అధికారుల బృందాలను నియమించి యుద్ద ప్రాతిపదికన నివేదికలు తెప్పించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామ‌న్నారు. గ్రామాల వారీగా వచ్చిన పంట నష్టం వివరాలను ప్రభుత్వానికి పంపి ఎకరాకు 25వేల రూపాయల నష్టపరిహారం ఇప్పించేలా చర్యలు చేపట్టాలని కోరుతున్నామ‌న్నారు. వరితో పాటు వివిధ పంటలకు మద్దతు ధరకు అదనంగా 500 రూపాయలు చెల్లిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిందన్నారు. ఖరీఫ్ నుంచే ఈ బోనస్ చెల్లింపు ను అమలు చేస్తామని చేయలేదన్నారు. యాసంగి పంటలకు బోనస్ చెల్లించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు.

త‌మ రెండు డిమాండ్లయిన పంట నష్టం వివరాల సేకరణ, బోనస్ చెల్లింపులపై సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తూ త్వరగా ప్రభుత్వం రైతులను ఆదుకొని వారికి నష్టపరిహారం, క్వింటాల్ కు మద్దతు ధరలను అందించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీలు ప్రతాప్, విజయ్, రాజారెడ్డి, జెడ్పిటిసి రాజశేఖర్, ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, కౌన్సిలర్స్ మురళి, నాగిరెడ్డి, గద్వాల టౌన్ పార్టీ అధ్యక్షులు గోవిందు, ధరూర్ మండల పార్టీ అధ్యక్షుడు డి.ఆర్ విజయ్, గద్వాల మండలం పార్టీ అధ్యక్షులు రాముడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు రమేష్ నాయుడు, హనుమంతు నాయుడు, రాధాకృష్ణారెడ్డి, సతీష్, ప్రభాకర్ గౌడ్,రిజ్వాన్, నవీన్ రెడ్డి కురుమన్న, నర్సింహులు, వాసు, తిక్కన్న, మేస్త్రి తిమ్మప్ప, మధు, గంజి పేట రాజు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement