Sunday, April 14, 2024

జాతీయ రహదారిపై లారీలు ఆపి.. ఆందోళన నిర్వహిస్తున్న రైతులు

నర్సంపేట-మహబూబాబాద్ జాతీయ రహదారిపై రైతులు తమ వడ్లను తరలించాలని వచ్చి పోయే వాహనాలను ఆపుతూ రోడ్లపై చెట్ల కొమ్మలు వేసి ఆందోళన నిర్వహించారు.తమ వడ్లను కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు మిల్లులకు తరలించకుండా వాహనాల లేమి అనే సాకుతో తాత్సారం చేస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. వచ్చి పోయే వాహనదారులకు దండం పెడుతూ తమ ఆందోళనకు మద్దతు ఇవ్వాలని కోరుతూ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. రైతుల ఆందోళనతో జాతీయ రహాదారిపై భారీ ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం కలిగిన పరిస్థితి. గత కొద్ది రోజుల నుండి వాతవారణ మార్పులే రైతుల ఆందోళనకు కారణమైతున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement