Friday, May 10, 2024

రైతు బంధు సాయం ఎంత మందికి అందింది?

రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ‘రైతుబంధు’ సాయం పంపిణీ కొనసాగుతున్నది. గురువారం 3 ఎకరాల్లోపు భూమి ఉన్న 10,40,017 మంది రైతుల ఖాతాల్లో రూ.1,275.85 కోట్ల నగదును సర్కార్‌ జమ చేయనుంది. ఇప్పటివరకు 42,42,178 మంది రైతుల ఖాతాల్లో రూ. 2,942.27 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ వెల్లడించింది.

రైతులు పంట సాగు చేసుకునేందుకు పెట్టుబడికి ఇబ్బంది లేకుండా తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు రైతుబంధు పథకం కింద ఎకరానికి ఏడాదికి రూ. 10 వేలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది సుమారు 63.25 లక్షల మంది రైతులను(150.18లక్షల ఎకరాలకు) రైతుబంధు పథకానికి అర్హులుగా గుర్తించారు. వీరందరికీ రైతుబంధు సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం రూ. 7508.78 కోట్లు కేటాయించింది. ఈ మొత్తాన్ని జూన్ 25 వరకు రైతుల బ్యాంకుల ఖాతాల్లో జమ చేయనున్నారు. నల్గోండాలో ఎక్కువ మంది రైతులు (4,72,983) ఉండగా.. మేడ్చల్-మల్కాజ్‏గిరి జిల్లాలో అత్యల్పంగా (39,762) రైతులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement