Tuesday, May 7, 2024

బిజినెస్ మేన్‌తో సహజీవనం చేస్తున్న స్టార్ హీరోయిన్

చిత్ర పరిశ్రమలో హీరో, హీరోయిన్లు ప్రేమలో పడటం, సహజీవనం చేయడం సాధారణ విషయమే. అందులోనూ బాలీవుడ్‌లో అయితే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్, శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభాస్ ‘సాహో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ హీరోయిన్ సౌత్ ఇండియాకు చెందిన ఓ వ్యాపారవేత్తతో ప్రేమలో పడినట్లు, అతడితో సహజీవనం చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ భామ ఇటీవల ముంబైలోని ఖరీదైన జుహు ప్రాంతంలో ఓ అపార్టుమెంట్ కొనిదంట. అందులోనే బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉంటుందని సమాచారం. మరి ఈ ప్రేమ జంట పెళ్లి పీటలు ఎక్కుతుందో లేదో చూడాలి. ప్రస్తుతం పవర్‌ స్టార్‌ పవన్ కల్యాణ్‌ హీరోగా దర్శకుడు క్రిష్ రూపొందిస్తోన్న ‘హరి హర వీరమల్లు’ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్‌గా నటించనుంది. త్వరలోనే ఆమె ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement