Thursday, May 2, 2024

కౌలు రైతుల ఆందోళన…..

కోటగిరి,(పోతంగల్)ఫిబ్రవరి 27(ప్రభ న్యూస్):హెగ్డేలి వ్యసాయ సహకార సంఘము ఆవరణలో సోమవారం రోజున రైతులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు డిమాండ్ చేస్తూ మాట్లాడుతూ… తాము పండించిన ప్రతి గింజను కొనుగోలు చెసి పండించిన రైతు ఖాతాలోనే డబ్బులు జమ చేయాలని రైతులు ఆందోళన పోతాంగల్ మండలం హెగ్డోలి గ్రామాలలో నెలకొంది. పోతంగల్ సహకార ఆధ్వర్యంలో హెగ్డోలి గ్రామంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన శనగల కొనుగోలు కేంద్రంలో ఎకరానికి 6 క్వింటాలు మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుందని విగిలిన పంటను ఎక్కడ అమ్ముకోవాలని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు . అంతే కాకుండా కౌలు నామ పత్రాలను తీసుకోవడం లేదని. అందువల్ల పట్టా రైతుల ఖాతాలలో నగదు జమ కావడం ద్వారా పండించిన కౌలు రైతులుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని. ప్రభుత్వం వెంటనే ఎకరానికి 6 క్వింటాల, నిబంధన ను తొలగించి పండించిన మొత్తం పంటను కొనుగోలు చెసి కౌలు నామ పత్రాన్ని తీసుకొని పండించిన రైతు ఖాతాలోనే డబ్బులు జమ చేయాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు నగేష్, మారుతీ, నారాయణ, పండరి నాథ్, పుప్పాల శంకర్, నాగం సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement