Friday, December 6, 2024

TS: ఏనుగు దాడిలో రైతు మృతి..

కొమురం భీం ఆసిఫాబాద్: ఏనుగు దాడిలో ఒకరు మృతిచెందిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని బూరెపల్లి గ్రామంలో ఇవాళ‌ చోటుచేసుకుంది..గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం… బురేపల్లి గ్రామంలో ఏనుగు మహారాష్ట్ర సరిహద్దు నుంచి భురేపల్లి గ్రామాల్లో బుధవారం వచ్చిందని తెలిపారు.

ఈ క్రమంలోనే భురేపల్లి గ్రామానికి చెందిన అల్లూరి శంకర్(50) అనే వ్యక్తి తోటలో పనిచేస్తుండగా ఆకస్మికంగా ఏనుగు దాడి చేసి చంపింది. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఫారెస్ట్ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఏనుగును మహారాష్ట్ర వైపు మళ్ళించే ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement