Thursday, April 25, 2024

కేసీఆర్ అందుకే నన్ను తప్పించారు: ఈటల రాజేందర్‌..

కేటీఆర్‌ను సీఎం చేసేందుకు కేసీఆర్‌ కుట్ర పన్ని తనను పక్కకు తోశారని మాజీమంత్రి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. తాను ఓడిపోతే శాశ్వతంగా రాజకీయాలను వదిలిపోతానని, కేసీఆర్, హరీశ్‌రావు తమ పదవులకు రాజీనామా చేస్తారా అంటూ సవాల్‌ విసిరారు. ‘బీజేపీలో ఉన్నవారికి దళితబంధు ఇవ్వబోమని అంటున్నారంటా.. మిస్టర్‌ సీఎం.. తెలంగాణ నీ అబ్బ జాగీరు కాదు. తెలంగాణ డబ్బులకు ఓనర్లు ప్రజలే.. అడ్డగోలుగా మాట్లాడితే ప్రళయం సృష్టిస్తం.. జాగ్రత్త’ అని హెచ్చరించారు. ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షలు ఎలాంటి షరతులు లేకుండా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటివరకు హుజూరాబాద్‌లో ఖర్చు చేసిన డబ్బులు కేసీఆర్‌ కుటుంబం కూలీకి పోయి సంపాందించినవా అని నిలదీశారు. గొర్ల మందల మీద పిచ్చి కుక్కలు, తోడేళ్లు దాడి చేసినట్లు.. తాను ఏ పాపం చేశానని తనపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి: సినిమాల జోలికి వస్తే ఏపీ ప్రభుత్వం తాట తీస్తా: పవన్ కళ్యాణ్

Advertisement

తాజా వార్తలు

Advertisement