Monday, May 20, 2024

Election Meet – సీఎల్పీ నేత భ‌ట్టితో మదన్మోహన్ భేటి…

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతినిత్యం ప్రజలతో మమేకమౌతు ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న మదన్మోహన్ హైదరాబాదులో కాంగ్రెస్ పార్టీ సెల్ఫీ నాయకులు బట్టి విక్రమార్కను కలిశారు. భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 1360 కిలోమీట‌ర్లు విజయవంతంగా పూర్తిచేసుకున్న సందర్భంగా వారికి మర్యాదపూర్వకంగా కలసి హృదయపూర్వక అభినందనలు తెలియచేసారు. అనంతరం వచ్చే ఎన్నికల్లలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అవలంభవించబోయే సాంకేతిక పరమైన అంశాల పై సురదీర్ఘంగా వారి మధ్య చర్చ జరిగింది.

గత పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మదన్మోహన్ పోటీ చేసి అతి తక్కువ ఓట్లతో ఓటమిపాలయ్యారు. ఆనాటి నుండి కొన్ని రోజులు బాన్సువాడ నియోజకవర్గంలో పేద ప్రజలకు అండగా నిలబడి నియోజకవర్గంలో తన ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేయాలన్న ఆలోచనతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతినిత్యం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడుతూ పేద ప్రజలకు ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement