Sunday, May 5, 2024

Election Campaign – ఎన్నిక‌ల ప్ర‌చారంలో బ‌లం – బ‌ల‌గం …

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ బ్యూరో : తెలంగాణ అం తటా.. రాజకీయం ఊపందుకుంది. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన మరుసటి రోజు నుంచే అభ్యర్థులు కంటిమీద కునుకులేకుండా తమతమ నియోజకవర్గాలను చుట్టే స్తున్నారు. ఏ గ్రామంలో చూసినా హోరెత్తిన ప్రచారమే కనిపిస్తోంది. పోరాటం చేసి మరీ టికెట్లు- దక్కించుకున్న నేతలు విజయమే లక్ష్యంగా దూసుకుపోతున్నారు. అధికార భారాస, ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీలు నువ్వా.. నేనా.. అన్న పోటీ తత్వంతో ఒకరికి మించి మరొకరు ప్రణాళికలు సిద్ధం చేసుకుని అమలు చేస్తున్నారు. భారాస అగ్రనేతలు ఇప్పటికే గత రెండున్నర నెలల కాలంగా ప్రచారంతో దూ సుకెళ్తున్నారు. చివరి నిమిషంలో బీ ఫాం దక్కిచుకున్న వా రు తమదైన శేలిలో ఓటర్లను కలిసేలా ప్రణాళికలు రూ పొం దించుకున్నారు. ఇక ఈ ఎన్నికల్లో విజయలక్ష్మి కటా క్షం ఎవరికో దక్కనుందో అనే ఉత్కంఠ మాత్రం అభ్య ర్థు ల్లోనే కాదు.. వాళ్ళ అనుచర వర్గంలోనూ కనిపిస్తోంది. అభ్య ర్థుల కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రుల తోనూ ప్రచార కార్యక్రమాలు రూపొందించి అమలు చేస్తున్నారు.

అదేసమయంలో ఓటరన్నను ప్రసన్నం చేసుకునేం దుకు పార్టీలన్నీ పోటాపోటాగా తలపడుతున్నారు. భారీగా ఖర్చు చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. బీఆర్‌ ఎస్‌తో పాటు- కాంగ్రెస్‌, బీజేపీ తదితర ప్రధాన పార్టీలు ఇలాంటి అధికారిక కార్యక్రమాలతోపాటు- అనధి కారి కంగా అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి. ఏ ఊళ్ళో ఏ సామాజిక కార్యక్రమం జరిగినా.. వెంటనే అక్కడకు వాలిపోయి ఆ ఖర్చంతా తామే భరిస్తామని ముందుకు వస్తున్నారు అభ్యర్థుల అనుచరులు. ముగిసిన దసరా నవ రాత్రి ఉత్సవాలు, దీపావళి పండగల సందర్భంగా ఊ రూరా అమ్మవారి విగ్రహాలను ఏర్పాటు- చేయటం, పూజా సామాగ్రిని ఏర్పాటు- చేయటం లాంటి కార్యక్రమాలు కనిపించాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ఆయా పార్టీలు ఎప్పటికప్పుడు కొత్తకొత్త ప్రణాళికలు రూపొందిస్తు న్నారు. ఏమాత్రం ఖర్చుకు వెనుకాడకుండా వీటిని పూర్తి చేయాలంటూ ఇప్పటికే పార్టీల ఆయా పార్టీల అధిష్టానాల నుంచి కిందిస్థాయికి ఆదేశాలు వెళ్లినట్టు- విశ్వసనీయ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

తెలంగాణ ఎన్నికల్లో రెబల్‌ అభ్యర్థులు పెద్దగా లేరు. అన్ని పార్టీలు అధికారిక అభ్యర్థులకు పెను సవాలు విసి రేలా తయారైన రెబల్స్‌ను కట్టడి చేయడంలో ఒకింత విజ యం సాధించాయి. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్‌, బీఆరెస్‌, బీజేపీ సక్సెస్‌ అయ్యాయి. నామినేషన్ల ఉపసంహరణ గడు వు ముగిసే సమయానికి ప్రధాన పార్టీల తరపున నామి నేషన్లు వేసిన బలమైన తిరుగుబాటు- అభ్యర్థులు మెజార్టీగా ఉపసంహరించుకొని పార్టీ అభ్యర్థికి ప్రచారం చేయడానికి సిద్దమయ్యారు. దీంతో ఈ సారి తెలంగాణలో ఇండిపెం డెంట్ల హవా పెద్దగా కనిపించే అవకాశం లేదు. ఒక్క ఇండిపెండెంట్‌ కూడా గెలవడం కష్టమన్న వాదన విని పిస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారం దాదాపు 80 స్థా నాల్లో ద్విముఖ పోటీ- ఉంది. మరో 30 స్థానాల్లో త్రిముఖ పోటీ- ఉన్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. టిక్కెట్ల కేటాయింపు సమయంలో ఆగమాగం కలిపించిన కాం గ్రెస్‌ రాష్ట్ర కార్యవర్గం పెద్దలు రెబల్స్‌ను బుజ్జగించడంలో ఎప్పుడూ లేనంతగా సక్సెస్‌ అయ్యారు. ఏఐసీసీ నేతల్ని రం గంలోకి దింపి.. అందర్నీ బుజ్జగించగలిగారు. అధికారం లోకి వచ్చాక అనేక పదవులు వస్తాయని, వాటిల్లో అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పారని సమాచారం. కొంత మంది తిరుగుబాటు- అభ్యర్థులకు ఇప్పటి వరకూ చేసిన ఖర్చును చెల్లిస్తామని అభ్యర్థులు హమీలు ఇచ్చారు.

ప్రధాన పార్టీల రెబల్స్‌, బలమైన ఇండిపెండెంట్‌లు పోటీ- నుంచి తప్పుకోవడంతో ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆరెస్‌ల మధ్య ముఖాముఖి పోటీ- నెలకొంది. గ్రేటర్‌ హైద్రాబాద్‌తో పాటు- పలు జిల్లాల్లో బీజేపీ బలంగా ఉన్న చోట త్రిముఖ పోటీ- సాగనుందని తెలుస్తోంది. త్రిముఖ పోటీ- స్థానాల్లో చాలాచోట్ల పోలింగ్‌ తేదీ సమీపించే నాటికి ద్విముఖ పోటీ- నెలకొనవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీఎస్పీ, సీపీఎం పోటీ- ఎవరి ఓట్లను చీల్చగలుగుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నామి నేషన్లు ఉపసంహరించుకున్నారు సరే మరి అభ్యర్ధుల గెలు పుకు చిత్తశుద్దితో పనిచేస్తారా? అన్నదే ఇపుడు మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా తయారైంది. నామినేషన్లను ఉపసం హరించుకున్న సీనియర్‌ నేతలు సుమారు 12 మంది ఉన్నారు. సూర్యాపేటలో రెబల్‌ అభ్యర్ధిగా నామి నేషన్‌ వేసిన పటేల్‌ రమేష్‌ రెడ్డి ఉపసంహరించుకున్నారు. ఏఐ ససీ తరపున రోహిత్‌ చౌదరి, మల్లురవి తదితరులు వెళ్ళి బుజ్జగించారు. దాంతో దామోదర్‌ రెడ్డి గెలుపుకు సహ కరి స్తానని హామీ ఇచ్చారు.
బాన్సువాడలో కాసుల బాలరాజు కూడా నామినేషన్‌ వేశారు. అయితే పార్టీలోని పెద్దల చర్చ లతో నామినేషన్‌ను ఉపసంహరించుకున్నారు. అలాగే జుక్కల్‌ లో గంగారామ్‌, వరంగల్‌ వెస్ట్‌ లో జంగా రాఘ వరెడ్డి, డోర్నకల్‌ లో నెహ్రూనాయక్‌, ఇంబ్రహిం పట్నంలో దండెం రామిరెడ్డి కూడా నామినేషన్ను ఉపసం హరిం చు కున్నారు. అయితే ఆదిలాబాద్‌ నుండి సంజీ వరెడ్డి మా త్రం నామినేషన్‌ ఉపసంహరించుకోలేదు. నామినేషన్‌ ఉపసంహరించుకున్న రమేష్‌ రెడ్డికి రాబోయే ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా టికెట్‌ ఖాయమైందని అంటు-న్నారు. అలాగే అద్దంకి దయాకర్‌కు వరంగల్‌ ఎంపీ టికెట్‌ హామీ దక్కిందని చెబుతున్నారు.
అధిష్టానం మాట మీద నామినేషన్లు ఉపసంహరిం చుకున్న వాళ్ళకి జిల్లాల పార్టీ అధ్యక్షులుగాను, నామినే-టె-డ్‌ పోస్టులు, ఎంఎల్సీలను హామీ ఇచ్చారు. మరికొందరికి ఎంపీ టికెట్లు- కూడా హామీలిచ్చారు. మొత్తంమీద 24 మంది తిరుగుబాటు- అభ్యర్ధులుగా నామినేషన్లు వేస్తే ఇందులో 12 మంది ఉపసంహరించుకున్నారు. మిగిలిన వాళ్ళకి ఉపసంహరణలకు అవకాశం దాటిపోయిన కారణంగా అభ్యర్ధులకు మద్దతుగా పనిచేయాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. రెబల్స్‌తో నామినేషన్లు ఉపసం హరింప జేయడంతో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ సక్సెస్‌ అ య్యాయి. తిరుగుబాటు- అభ్యర్థుల్లో మెజారిటీ- నాయకులు పోటీ- నుంచి తప్పుకున్నారు. పార్టీ నిలిపిన అభ్యర్థులకు మద్దతు ఇస్తామని తెలిపారు. నామినేషన్ల ఉప సంహరణ తర్వాత తెలంగాణ ఎన్నికల బరిలో నిలిచిన వారిలో స్వ తంత్రులు బాగా తగ్గిపోయారు. గత ఎన్నికలతో పోలిస్తే ఈ సారి స్వతంత్రుల హవా బాగా తగ్గిందని విశ్లేషకులు పేర్కొ ంటు-న్నారు. ఇక బరిలో ఉన్న ఇండిపెండెంట్లలో ఒక్కరు కూడా గెలిచే అవకాశం కనిపించడం లేదని అంటు-న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement