Tuesday, May 7, 2024

ఇంటర్ ఫలితాలు – 8 మంది విద్యార్థులు బలవన్మరణం

ఇంటర్‌లో ఫెయిలయ్యామని, మార్కులు తక్కువగా వచ్చాయని రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 8 మంది విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడ్డారు.

తిరుపతికి చెందిన విద్యార్థి(17) ఈసీఐఎల్‌ రామకృష్ణాపురంలో ఉంటూ.. పటాన్‌చెరులో ఇంటర్‌(ఎంపీసీ) చదివాడు. ఫెయిల్‌ అవుతానని మనస్తాపంతో సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం గుండ్ల పోచంపల్లి- మేడ్చల్‌ రైల్వేస్టేషన్ల మధ్య పట్టాలపై మృతదేహం లభ్యమైంది. ఆ విద్యార్థి ఫలితాలు తెలియరాలేదు.

  • గద్వాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి(17) హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్నాడు. ప్రథమ సంవత్సరంలో ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ కావడంతో మనస్తాపం చెంది ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ప్రకాశం జిల్లాకు చెందిన విద్యార్థిని(17) హైదరాబాద్‌లో ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌(ఎంపీసీ) చదివింది. ఫెయిల్‌ కావడంతో ఇంట్లో ఉరేసుకుంది.

సికింద్రాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో ఠాణా పరిధి వినాయక్‌ నగర్‌కు చెందిన విద్యార్థి(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదివాడు. ఒక సబ్జెక్టులో ఫెయిల్‌ అవడంతో ఇంట్లో ఉరేసుకున్నాడు.

ఖైరతాబాద్‌ తుమ్మలబస్తీకి చెందిన విద్యార్థి(17) ఎస్సార్‌నగర్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌(బైపీసీ) రెండో సంవత్సరం పూర్తిచేశాడు. ఒక సబ్జెక్టులో తప్పడంతో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

- Advertisement -

జగిత్యాల జిల్లా మేడిపల్లికి చెందిన విద్యార్థి(16) జగిత్యాలలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదివాడు. 4 సబ్జెక్టుల్లో ఫెయిలయ్యానని మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకున్నాడు.

  • నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌కు చెందిన విద్యార్థి(17) హైదరాబాద్‌లో ఓ కార్పొరేట్‌ విద్యాసంస్థలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం(బైపీసీ) చదివాడు. మూడు సబ్జెక్టుల్లో అనుత్తీర్ణుడవడంతో ఇంట్లో ఉరేసుకున్నాడు.

నారాయణపేట జిల్లా కొత్తకోటకు చెందిన ఓ విద్యార్థిని(17)కి ఎంపీసీ మొదటి సంవత్సరంలో 365 మార్కులు వచ్చాయి. మార్కులు తక్కువగా వచ్చాయని మనోవేదనకు గురై ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

విద్యార్థిని అదృశ్యంఇంటర్‌లో ఫెయిలయ్యానని మనస్తాపంతో ఓ విద్యార్థిని అదృశ్యం అయిన ఘటన బీడీఎల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ సాయిలు కథనం ప్రకారం.. పటాన్‌చెరు సమీప పాటి గ్రామంలో నివాసం ఉంటున్న భవాని.. ఇంటర్‌ రెండో సంవత్సరంలో కొన్ని సబ్జెక్టుల్లో పాస్‌ కాలేదు. బయటకు వెళ్లి వస్తానంటూ అక్కకు చెప్పి వెళ్లిన ఆ విద్యార్థిని తిరిగి ఇంటికి రాలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement