Wednesday, May 15, 2024

చెంచుల అభ్యున్నతికి అన్ని విధాలా కృషి.. న‌ల్ల‌మ‌ల ప్రాంతంలో గ‌వ‌ర్న‌ర్ త‌మిళిసై ప‌ర్య‌ట‌న‌

అమ్రాబాద్‌, ప్రభన్యూస్‌: నల్లమల ప్రాంతంలో జీవనం సాగిస్తున్న చెంచుల అభ్యున్నతికి తనవంతుగా శాయశక్తులా కృషి చేస్తానని, అర్హులైన ప్రతిఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అప్పాపూర్‌ గ్రామాన్ని అధికారులతో కలిసి గవర్నర్‌ సందర్శించారు. అప్పాపూర్‌లో గవర్నర్‌ ప్రత్యేక నిధులతో ఏర్పాటు- చేసిన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించారు. హెల్త్‌ స్కానింగ్‌, మహిళలకు కుట్టు-మిషన్‌ కేంద్రం, ఆశ్రమ పాఠశాలలో తాగునీటికి సోలార్‌ పంప్‌ సెట్‌, అప్పాపూర్‌, భౌరాపూర్‌ పెంటలకు రెండు ద్విచక్ర వాహన అంబులెన్స్‌, కమ్యూనిటీ- షెడ్‌ ప్రారంభించడంతో పాటు- మహిళలకు హైజినిక్‌ కిట్లు-, ఇప్ప పువ్వుతో ప్రత్యేకంగా తయారు చేసిన పోషక విలువలుగల పదార్థాలు, విద్యార్థులకు ఆర్థిక సహాయం, స్టడీ మెటీ-రియల్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నల్లమల్ల దట్టమైన అడవిలో నివసిస్తున్న అడవి బిడ్డలను కలుసుకోవడం ద్వారా తన జీవితం ధన్యమైందని గవర్నర్‌ పేర్కొన్నారు. చాలా సంతోషంగా ఉందని, తన జీవితంలో మధురమైన జ్ఞాపకంగా ఉండిపోతుందన్నారు. రాష్ట్రంలో ఆదివాసీలు చాలామంది ఉన్నారని రాష్ట్రంలోని నాగర్‌ కర్నూల్‌, భద్రాద్రి కొత్త గూడెం, ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆరు గ్రామాలను దత్తత తీసుకోవడం జరిగిందన్నారు.

వారికి సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నట్లు- వెల్లడించారు. చెంచులు ఆరోగ్యవంతులుగా ఉండాలని డాక్టర్‌ చదివిన తనకు ఆదివాసీల ఆరోగ్యంపై ఆందోళన ఉంటు-ందన్నారు. మంచి పోషకాహారం తీసుకొని తమ ఆరోగ్యం కాపాడుకోవాలని చెంచులకు సూచించారు. ఆదివాసిలు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, నాణ్యమైన విద్య, వైద్యం, ఉపాధి కలిగి ఉండాలని కోరుకుంటు-న్నట్లు- తెలిపారు. ఆదివాసీల ఉపాధి-కై- ఐటిడిఏ ద్వారా పలు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, వ్యవసాయ, హార్టికల్చర్‌ తదితర యూనివర్సిటీ-లు కృషి చేస్తున్నాయన్నారు. రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యలో ఆరోగ్య శిబిరాలు, గిరిరాజా కోళ్లు ఇవ్వడం జరిగిందన్నారు. ప్రస్తుతం అప్పాపూర్‌, భౌరపూర్‌ పెంటలను పైలట్‌ ప్రాజెక్టుగా తీసుకోవడం జరుగుతుందని రాబోయే రోజుల్లో మరిన్ని చెంచు పెంటలకు విస్తరిస్తామని తెలిపారు. ఆదివాసీలు తమ ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని, మరోసారి తిరిగి వస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ భవన్‌ కార్యదర్శి సురేంద్ర, నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ ఉదయ్‌ కుమార్‌, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పి.పద్మావతి, ఎస్పీ కె.మనోహర్‌, అదనపు కలెక్టర్‌ మనుచౌదరి, డిఎఫ్‌ఓ కిష్టా గౌడ్‌, పిఓ ఐటిడిఏ అశోక్‌, ఎఫ్‌డిఓ రోహిత్‌ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి సుధాకర్‌ లాల్‌, ఎంపిపి గీతాంజలి, అప్పాపూర్‌ సర్పంచ్‌ గురువయ్య. సార్లపల్లి సర్పంచ్‌ మల్లిఖార్జున్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, చెంచు ప్రజలు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement