Monday, April 29, 2024

లాక్ డౌన్ రూల్స్ వర్తించవా..? ఘనంగా దుబ్బె పర్ఫ్యూమ్ ఓనర్ కూతురి పెళ్లి

తెలంగాణలో కరోనా కట్టడికి లాక్ డౌన్ చాలా కఠినంగా అమలవుతోంది. అయితే ఇది సామాన్యులకు మాత్రమే అన్నట్లు ఉంది వ్యవహారం. బడా వ్యాపారవేత్తలకు ఈ రూల్స్ వర్తించడం లేదు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీలో జరిగిన ఓ వివాహ వేడుకనే ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. లాక్ డౌన్ రూల్స్ ను తుంగలో తొక్కారు దుబ్బె ఫేక్టరీ ఓనర్. పాతబస్తీలో దుబ్బె పర్ఫ్యూమ్ ఓనర్ కూతురి పెళ్లి ఘనంగా జరిగింది. అస్సలు లాక్ డౌన్ నిబంధనలు పాటించలేదు. సోషల్ డిస్టెన్స్, లాక్ డౌన్ రూల్స్ పట్టించకుండా జరిగిన ఈ వివాహానికి వందల మంది హాజరయినట్లు తెలుస్తోంది. కమటి పుర పీఎస్ పరిధిలోని సవేర ఫంక్షన్ హాల్ లో జరిగిన ఈ పెళ్ళికి జనాలు గుంపులు గుంపులుగా హాజరయ్యారు. అంతే కాదు లో టపాసులు పేలిస్తూ చుట్టు ప్రక్కల ప్రాంతాలను హడల్ ఎత్తించింది దుబ్బె కుటుంబం. ఇక పెళ్లికి హాజరైన వీఐపీలు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు.

దగ్గరుండి పెళ్లికి సెక్యురిటి కల్పించారు సౌత్ జోన్ పోలీసులు. పెళ్లికి వచ్చిన జనాలు గుమిగూడిన పోలీసులు పట్టించుకోకపోవడం గమనార్హం. నిన్న సాయంత్రం 6 నుండి రాత్రి 12 గంటల వరకు వివాహ వేడుకలు జరిగాయి. పైగా ఈ పెళ్లికి రాష్ట్ర హోం శాఖ మంత్రి మహుమద్ అలీ కూడా హాజరయ్యారు. లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘిస్తూ వివాహం జరగడంతో MBT ప్రెసిడెంట్ అంజదుల్లాఖాన్ ట్విట్టర్ ద్వారా తెలంగాణ డీజీపీ, మంత్రి కేటీఆర్, హైదరాబాద్ సీపీ సమాచారం ఇచ్చాడు. సవేర ఫంక్షన్ హాల్ లో ఏం జరుగితుంది, లాక్ డౌన్ టైం లో ఇంత మంది జనాలు ఎందుకు పొగయ్యారు అంటూ ప్రశ్న ట్విట్వర్ లో ప్రశ్నించారు. లాక్ డౌన్ టైం రోడ్ ఎక్కితేనే వాహనాలు సీజ్ చేస్తున్నారు, మరి ఇన్ని వాహనాలు ఎక్కడ నుండి వొచ్చాయి…..?హైదరాబాద్ పాతబస్తీలో లాక్ డౌన్ రూల్స్ పాటించట్లేద…..? సవేర ఫంక్షన్ హాల్ లో జరిగిన పెళ్లి పై ఎవరి పై చర్యలు తీసుకుంటారు…….?దగ్గరుండి సెక్యురిటి ఇచ్చిన పోలీసుల పైన లేక పెళ్లి జరిపించిన దుబ్బే కుటుంబ పైనా……..? అని ట్విట్వర్ లో ప్రశ్నల వర్షం కురిపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement