Friday, May 3, 2024

Domalaguda PS – ఆరు లక్షల రూపాయలు సీజ్

ముషీరాబాద్ – ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల తనిఖీలు ముమ్మరం చేశారు. దోమలగూడ పోలీసు స్టేషన్ డిఐ వరప్రసాద్, ఎస్సైలు సాయికృష్ణ, శ్రీకాంత్, శ్రీనివాస్ రెడ్డి లు మంగళవారం రాత్రి 9 గంటల సమయంలో నారాయణగూడ వై జంక్షన్ వద్ద వాహన తనిఖీ నిర్వహించారు. టి ఎస్ 08 జె ఎన్ 0816 నెంబరు గల ద్విచక్ర వాహనం పై కవాడిగూడ బండ మైసమ్మ బస్తీకి మామిడి నర్సింహ (35) ఎటువంటి సంబంధిత పత్రాలు లేకుండా తన భాషా సంచిలో ఆరు లక్షల రూపాయలు తీసుకెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఎటువంటి సంబంధిత పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న ఆరు లక్షల రూపాయలు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు., :

Advertisement

తాజా వార్తలు

Advertisement