Friday, May 17, 2024

TS : ఎమ్మెల్సీగా దండె విఠ‌ల్ ఎన్నిక చెల్లదు… హైకోర్టు

ఉమ్మడి ఆదిలాబాద్ బ్యూరో (ప్రభ న్యూస్): భారాస ఎమ్మెల్సీ దండె విఠల్ ఎన్నికపై హైకోర్టు సంచలన తీర్పు వెల్లడించింది.
ఎమ్మెల్సీగా ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది హైకోర్టు. కాంగ్రెస్ నేత పత్తిరెడ్డి రాజేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022లో ఎన్నికైన దండె విఠల్ ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్ ఉపసంహరణ పత్రాలు కోర్టుకు సమర్పించారనీ రాజేశ్వర్ రెడ్డి పిటీషన్ దాఖలు చేయగా హైకోర్టులో విచారణ అనంతరం దండె విఠల్ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని సంచలన తీర్పునిచ్చింది. అంతేగాక దండె విఠల్ కు రూ.50వేల జరిమానా విధించిన హైకోర్టు న్యాయస్థానం. అయితే దండె విఠల్ న్యాయవాది అభ్యర్థనతో తీర్పును 4వారాలు సస్పెండ్ చేసింది హైకోర్టు ధర్మాసనం.

సుప్రీం కోర్టు లో సవాల్ చేస్తా
నిర్మల్ ప్రతినిధి ప్రభా న్యూస్ ) ఎమ్మెల్సీఎన్నికల్లోవేరే అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణ సరిగా జరగలేదన్న కారణం తో ఈ తీర్పు వచ్చిందని, అభ్యర్థి నామినేషన్ ఉపసంహరణతో తనకు సంబంధం లేని వ్యవహారమనీ అదిలాబాద్ ఎమ్మెల్సీ దండ విట్టల్ ఆంధ్రప్రభ తో అన్నారు. …ఏది ఏమైనా ఈ తీర్పుపై అప్పీల్ కు నాకు నాలుగు వారాల గడువు లభించిందని, దీంతో ఈ తీర్పుపై
సుప్రీంకోర్టులో సవాలు చేస్తానని అన్నారు..తనకు సుప్రీం కోర్టులో న్యాయం జరుగుతుదనే ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement