Sunday, April 28, 2024

Doctor’s Day: వైద్యులను సత్కరించిన ఉప్పల శ్రీనివాస్ గుప్తా

ప్రజా డైరీ ప్రజా మీడియా 9 ఎంటర్ టైన్ మెంట్ ఆధ్వర్యంలో ఘనంగా నేషనల్ డాక్టర్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా నిబద్దతతో సేవలు అందిస్తున్న వైద్యులందరికీ అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా నేషనల్ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని కోకాపేట, నానక్ రామ్ గూడ వైద్య అండ్ ఆరోగ్య శాఖ మంత్రి హరిశ్ రావు క్యాంప్ కార్యాలయంలో (ప్రజా మేగజైన్ సెలబ్రిటీ అవార్డుల) ప్రజా డైరీ ప్రజా మీడియా 9 ఎంటర్ టైన్ మెంట్ ఆధ్వర్యంలో.. నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా జరిగిన (ప్రజా మేగజైన్ సెలబ్రిటీ అవార్డుల) ప్రజా డైరీ సెలబ్రిటీ అవార్డ్స్ ప్రదానోత్సవం, సన్మాన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక అండ్ వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరిశ్ రావు, విశిష్ట అతిథిగా ప్రముఖ నటుడు హీరో సుమన్ తల్వార్ తో కలిసి ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా.. వైద్య రంగంలో ఉత్తమ సేవలు అందించిన వారికి, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించిన వారికి నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా సెలబ్రిటీ అవార్డులను మంత్రి చేతుల మీదుగా అందజేసి సన్మానించడం జరిగింది. ఆ తరవాత పలువురు డాక్టర్స్ కు మెమెంటోలు కూడా అందజేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… దైవ సమానులైన వైద్యులందరికీ డాక్టర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ.. దేవుడు ప్రాణం పోస్తే …వైద్యుడు పునర్జన్మ ఇస్తాడన్నారు. అందుకే వైద్యులను దేవుడితో సమానం అంటారన్నారు. ఆపద సమయంలో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న అనేకమంది ప్రాణాలను కాపాడుతున్న వైద్యులు అందరూ దేవుడిగా పిలవబడుతున్నారన్నారు. గతంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న పాండమిక్ మహమ్మారి నేపథ్యంలో వైద్యులు తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజలకు మెరుగైన వైద్యం అందిస్తూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. రాత్రి, పగలు అనే తేడా లేకుండా.. వైద్యం అంటే ఓ వృత్తిగా కాకుండా ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని బ్రతికించే ఓ మహాశక్తిగా అన్నివేళలా ప్రజలకు సేవ చేస్తున్న వైద్యులందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా డైరీ ఎడిటర్ వి.సురేష్, డా.కిరణ్, డా.పల్లవి, డా.స్మిత ఆళ్లగడ్డ, డా.ఎమ్.సాయి కిరణ్, డా.నారాయణరెడ్డి, వెంకట్ రావు, ముఖేష్, ప్రవీణ్, హనుమంతరావు, శ్రీకాంత్ రెడ్డి, వైవ రెడ్డి, మూవీ ఆర్టిస్ట్ లు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement