Friday, May 3, 2024

MLC Group – ఎమ్మెల్యే శంక‌ర్ నాయ‌క్ కు అసమ్మ‌తి సెగ‌..

మహబూబాబాద్ బిఆర్ఎస్ లో వర్గ విభేదాలు రచ్ఛకెక్కాయి. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కు టికెట్ ఇస్తే సహకరించమని ఎమ్మెల్సీ తక్కిలపల్లి రవీందర్రావు వర్గీయులు ఉద్యమకారులు వేరువేరుగా సమావేశాలు ఏర్పాటు చేసుకుని తేల్చి చెప్పారు. ఓ మామిడి తోటలో రహస్యంగా సమావేశమైన తక్కల్లపల్లి వర్గీయులు రాబోయే ఎన్నికల్లో మహబూ బాబాద్ నియోజకవర్గం నుంచి మూడోసారి శంకర్ నాయక్ కు టికెట్ ఇవ్వద్దని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఈ రహాస్య సమావేశంలో ముగ్గురు బిఆర్ఎస్ కౌన్సిలర్ కూడా ఉన్నట్లు సమాచారం. ఎమ్మెల్యే శంకర్ నాయక్ పై తిరుగుబాటు చేశారు. ఇతరులు ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. దీంతో జిల్లాలో మరోసారి మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ హాట్ టాపిక్ గా మారాయి

Advertisement

తాజా వార్తలు

Advertisement