Friday, May 17, 2024

తెలుగులో మొదటి సిరీస్ విడుదల చేసిన డైస్‌ మీడియా

పాకెట్‌ ఏసెస్‌కు చెందిన ప్రీమియం స్టోరీ టెల్లింగ్‌ ఛానెల్‌ డైస్‌ మీడియా, పండుగ సంబరాలను కాస్త ముందే తీసుకువస్తూ ప్రాంతీయ కంటెంట్‌ విభాగంలో ప్రవేశిస్తున్నట్లు వెల్లడించింది. దీనిలో భాగంగా తమ మొట్టమొదటి తెలుగు సిరీస్‌ ‘అల్లుడుగారు’ ను విడుదల చేసింది. ఈ నూతన సిరీస్‌ డైస్‌ మీడియా గతంలో రూపొందించగా అపూర్వ విజయం సాధించిన ఫ్యామిలీ డ్రామా, ‘వాట్‌ ద ఫోక్స్‌ !’కు రీమేక్‌. అల్లుడుగారు సీజన్‌ 1 ను తెలుగు ఓటీటీ ఆహా లో 29 అక్టోబర్‌ 2021 నుంచి ప్రసారం చేస్తున్నారు. ఈసంద‌ర్భంగా పాకెట్‌ ఏసెస్‌ కో–ఫౌండర్‌, సీఈవో అదితి శ్రీవాస్తవ మాట్లాడుతూ… రీజనల్‌ కంటెంట్‌ విభాగంలో ప్రవేశిస్తుండటం పట్ల సంతోషంగా ఉన్నామన్నారు. త‌మ ప్రాంతీయ కంటెంట్‌ కార్యకలాపాలు ఆరంభించేందుకు తెలుగు చక్కటి మాధ్యమంగా భావించామ‌న్నారు. త్వరలో డైస్‌ మీడియా నుంచి మరిన్ని తెలుగు, తమిళ షోలను మీరు చూడనున్నారని ఆయ‌న‌ అన్నారు. పాకెట్‌ ఏసెస్‌ వద్ద షో రన్నర్‌ సర్జితా జైన్‌ మాట్లాడుతూ… వాట్‌ ద ఫోల్క్స్‌! ఎక్కువ మంది అభిమానించిన సిరీస్‌లలో ఒకటని. దీనిని తెలుగు ప్రేక్షకుల కోసం పునర్నిర్మించడం ఆనందంగా ఉందన్నారు. కాశీ, సుధల‌తో పాటుగా ప్రతిభావంతులైన ధన్య, అభిజీత్‌లు ఈ షోను ఆకట్టుకునేలా నిలిపారని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement