Saturday, May 4, 2024

NZB: మరోసారి దీవిస్తాం.. మరింత అభివృద్ధి చేయండి.. సభాపతికి నీరాజనాలు

బాన్సువాడ నియోజకవర్గంలోని కోటగిరి మండల గ్రామంలో సోమవారం సభాపతి పలు కార్యక్రమాలను చేపట్టారు. గ్రామానికి విచ్చేసిన సభాపతికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి మంగళ హారతులతో దీవెనలు పలికారు. రాబోయే ఎన్నికల్లో తమ గ్రామ దీవెనలు ఏకపక్షంగా మీకే ఉంటాయని తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటూ ఎత్తొండ గ్రామస్తులు ముక్తకంఠంతో నినాదాలు చేశారు. గతంలో గ్రామంలో ప్రజలు ఎన్నో సమస్యలతో సతమతం అవుతూ ఉండేవారని, ప్రస్తుతం కోటగిరి మండలం సుభిక్షంగా ఉందని ప్రజలు మేళ తాళాలతో పోచారానికి అభినందనల వర్షం కురిపించారు.

ఆదరించండి.. నా ప్రాణం ఉన్నంత వరకు అభివృద్దే లక్ష్యం.. పోచారం :

40ఏళ్ల క్రితం తాను రాజకీయ ప్రస్థానం చేశానని, ఆనాటి నుండి నేటి వరకు అభివృద్ధే తాను లక్ష్యంగా ఎంచుకొని ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటూ సంక్షేమ పథకాల అమలుతో పాటు బాన్సువాడ నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడిపిస్తున్నానని రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆదరించండి తన ప్రాణం ఉన్నంత వరకు ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం తన శాయాశక్తులా కృషి చేస్తానని సభాపతి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రజలకు భరోసా ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో మన రాష్ట్రం దేశంలోనే అభివృద్ధిలో నంబర్ వన్ స్థానంలో ఉందని, సంక్షేమ పథకాల అమల్లో ప్రపంచంలోనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ తీరు మారుమోగుతుందని సభాపతి అన్నారు. ఉద్యమించి రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్న ఉద్యమ సారధి తన ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రజలు రెండుసార్లు ఆశీర్వదించడంతో తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంతో పాటు రాష్ట్ర పేరు ప్రఖ్యాతలను ఇనుమడింప చేశారని సభాపతి కొని ఆడారు.

- Advertisement -

ఎన్నికల తరుణంలో ఎన్నో పార్టీలు, ఎంతో మంది నాయకులు ప్రజలకు మేమేదో చేస్తామంటూ మోసం చేసే ప్రకటన చేస్తున్నారని ప్రజలు కూడా ఆలోచన చేసి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తీరును పరిశీలన చేసుకొని రాబోయే ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బిజెపి, కాంగ్రెస్ లు చేసే మోసాలకు ప్రజలు బలి కావద్దని హితవు పలికారు. తాను ఏనాడు ఎన్నికల్లో రాజకీయ పార్టీలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలను అమలు చేయలేదన్నారు. నియోజకవర్గంలో పేదలందరికీ ఇళ్ళు నిర్మింపజేయడమే తన లక్ష్యమన్నారు. ఇప్పటికే మన నియోజకవర్గానికి 14వేల పైచిలుకు ఇల్లు మంజూరు కావడం జరిగిందన్నారు. రాబోయే రోజుల్లో తన నియోజకవర్గంలో నిరుపేదల అందరికీ గృహాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

తాను ఎన్నికలను ఏనాడు దృష్టిలో పెట్టుకోనని, ప్రతినిత్యం హైదరాబాదులో ఉన్న ప్రజలు శ్రేయస్సు కోరే పనిలో ఉంటానని బాన్సువాడలో ఉంటే ఒక్కరోజు కూడా తాను ఇంటి వద్ద ఉండే ఆలోచన రాదని, గ్రామాల్లో ప్రతినిత్యం తిరగడం, ప్రజా సమస్యలు తెలుసుకోవడం, పరిష్కరించడమే తన అంతిమ లక్ష్యమన్నారు. తొండ నుండి కోటగిరికి రెండు కోట్ల రూపాయలతో డబుల్ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని తెలిపారు. దాన్యం కొనుగోలు కేంద్రాలు రాష్ట్రంలో 7500 కాంటాలు పెట్టి రైతులకు ఇబ్బందులు కలగకుండా రైతు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేయడంతో పాటు రైతుకు 15 రోజుల్లోపు డబ్బు చెల్లింపు కూడా చేయడం జరిగిందన్నారు. గ్రామంలో 11కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు కేటాయించడం జరిగిందని సభాపతి వివరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement