Sunday, October 6, 2024

Delicious – బిర్యాని కోసం అర్ధ‌రాత్రి పాత‌బ‌స్తీ రెస్టారెంట్ కు కెటిఆర్ ….

హైద‌రాబాద్ బిరియాని అంటే ఎవ‌రికి ఇష్టం ఉండ‌దు చెప్పండి.. అందులోనూ పాత‌బ‌స్తీలోని టేస్ట్ అంటే మ‌రీ ఇష్టం.. ఎన్నిక‌ల వేళ అటు ప్ర‌చారంలోనూ, ఇటు నేత‌ల స‌మ‌న్వ‌యం చేయ‌డంలో క్ష‌ణం కూడా విశ్రాంతి లేని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కు అర్ధ‌రాత్రి బిరియాని తినాల‌నిపించింది.. అంతే పాతబస్తీ మదీనా చౌరస్తా దగ్గర ఓ రెస్టారెంట్‌లో మంత్రి ప్ర‌త్య‌క్ష్య‌మ‌య్యారు.. అక్కడకు వచ్చినవారంతా ఒక్కసారిగా షాకయ్యారు. ప్రోటోకాల్ లేకుండా సాదాసీదా వ్య‌క్తిగా ఆయన రెస్టారెంట్‌కు వెళ్లారు. అక్కడకు వెళ్లేంత వరకు ఆయనను పెద్దగా ఎవరూ గుర్తుపట్టలేదు. కానీ ఆర్డర్‌ ఇచ్చే సమయంలో మంత్రిని చూసిన అక్కడివారు ఆశ్చర్యపోయారు.


వచ్చి బిర్యానీ తో పాటు మ‌రికొన్నింటిని ఆర్డ‌ర్ చేసి హోట‌ల్లోనే తాఫిగా తిన్నారు. మంత్రి వచ్చారని తెలుసుకుని ఆయనకు స్పెషల్‌ డిషెస్‌ను వడ్డించారు రెస్టారెంట్‌ యాజమాన్యం. ఆయన ఇటు డిన్నర్‌ చేస్తూనే అక్కడకు వచ్చిన వారిని పలకరించారు. మంచిచెడులు అడిగి తెలుసుకున్నారు. కేటీఆర్ రాకతో హోటల్‌కు పెద్ద ఎత్తున జనం గుమిగూడారు. మంత్రితో సెల్ఫీలకోసం ఎగబడ్డారు జనం. ఇంత జ‌రుగుతున్న అక్క‌డ ప్ర‌త్యేక పోలీస్ బందోబ‌స్త్ లేక‌పోవ‌డం విశేషం.. ఎంత సైలెంట్ గా వ‌చ్చారో.. అంతే సైలెంట్ గా కెటిఆర్ అక్క‌డ నుంచి త‌న కారులో వెళ్లిపోయారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement