Sunday, May 5, 2024

భార్య మానసిక క్షోభ కోసం – కన్న కూతుర్ని బ్లేడ్ తో హత మార్చిన కసాయి తండ్రి

భార్య వదిలిపెట్టిందన్నకక్షతో కన్నకూతురుని చంపిన కసాయి తండ్రి…పెద్దఅంబర్ పెట్ ఓ.అర్.అర్ పై కారుకు ప్రమాదం కావడంతో బయటపడ్డ హత్యా ఉదంతం.చందానగర్‌లో అమానవీయ ఘటన.

ఎల్బీనగర్ ఆగస్టు 19 (ప్రభ న్యూస్)..భార్య వదిలిపెట్టిందని, మనస్థాపం చెందిన భర్త.. ఆమెను కూడా మానసిక క్షోభకు గురిచేయాలని కన్న కూతురిని అతికిరాతకంగా చంపి మృతదేహాన్ని నగర శివారు ప్రాంతంలో పడవేయ బోయి పోలీసులకు పట్టుబడ్డ సంఘటన వనస్థలిపురం ఏసీపి డివిజన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వనస్థలిపురం ఏసీపి భీమ్ రెడ్డి శనివారం సాయంత్రం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ విజయవాడకు చెందిన కుందేటి చంద్రశేఖర్. హిమబిందు భార్యాభర్తలిద్దరూ సాఫ్ట్వేర్ ఉద్యోగులు. అమెరికా నుంచి నాలుగు సంవత్సరాల క్రితం నగరానికి వచ్చి కూతురు మోక్షజ ( 8) తో కలసి చందానగర్ ఆర్టీసీ కాలనీలో నివాసం ఉంటున్నారు. గత కొన్ని నెలల క్రితం చంద్రశేఖర్ ఉద్యోగం పోయింది. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్దాలు వచ్చాయి. హిమబిందు చంద్రశేఖర్ ను వదిలి పెట్టి బిహెచ్ఎల్ లో ఉంటున్న తల్లి గారి ఇంటి వద్ద ఉంటుంది. మోక్షజ బిహెచ్ఇఎల్ లోనీ జ్యోతి విద్యాలయంలో నాలుగో తరగతి చదువుతుంది.

ఒంటరిగా ఉంటున్న చంద్రశేఖర్ మనస్తాపంతో భార్యపై ఎలాగైనా కక్ష తీర్చుకుని ఆమెను మనశ్శాంతి లేకుండా చేయాలని పతకం పన్నాడు. ఈ క్రమంలో కన్న కూతురిని చంపాలని ఎనిమిది రోజుల క్రితమే పెన్సిల్ బ్లేడును కొన్నాడు. శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మోక్షజ నుస్కూల్‌లో నుండి మాయమాటలు చెప్పి చంద్రశేఖర్‌ కారులో ఏపీ 28 డిడబ్ల్యూ 4667 టయోటా ఇతియోస్ కారులో ఎక్కించుకున్న పదినిమిషాల్లోపే గొంతు కోసి చంపాడు.

మృతదేహాన్ని పడవేయాలని నగర శివారు ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ఈ క్రమంలో అబ్దుల్లాపూర్ మేట్ పీఎస్ పరిధి పెద్ద అంబర్పేట్ ఓ ఆర్ ఆర్ చుట్టూ రెండు రౌండ్లు తిరిగాడు. టెన్న్షన్ లో అతను కోహెడ సమీపంలో కారు డివైడర్ ను బలంగా ఢీకొట్టగా కారు టైరు పేలిపోయింది. అక్కడున్నవారు 100 నెంబర్ కుఫోన్ చేశారు. పోలీసులు వెళ్లి చూడగా కారులో చిన్నారి మృతదేహం ఉంది. క్లూస్ టీం మరియు పోలీసులు విచారించగా పాప సొంత కూతురని తన భార్య మీద ఉన్న కోపంతో చంపానని ఒప్పుకున్నాడు. అరెస్ట్ చేసిన చంద్రశేఖర్ ను శనివారం రాత్రి రిమాండ్ కు తరలించారు.

- Advertisement -

మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. విలేకరుల సమావేశంలో అబ్దుల్లాపూర్మెట్ ఇన్స్పెక్టర్ మన్మోహన్ ,ఎస్సై కే. వెంకటరెడ్డి బి. కిషన్ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement