Friday, May 17, 2024

Big story | వెలుగులు చిమ్ముతున్న ‘‘జెన్‌కో’’.. రికార్డు స్థాయిలో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి

అమరావతి, ఆంధ్రప్రభ ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్‌కో) విద్యుత్‌ ఉత్పత్తిలో రికార్డులు సృష్టిస్తోంది. గత నెలలో సీలేరు బేసిన్‌ జలవిద్యుత్‌ కేంద్రాలు గరిష్ట విద్యుత్‌ ఉత్పత్తి నమోదు చేయగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నాలుగన్నర నెలల్లో థర్మల్‌ యూనిట్లు అద్భుత పనితీరు ప్రదర్శించడం గమనార్హం. 2022- 23 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ 1 నుంచి ఆగస్టు 18వ తేదీ అర్ధరాత్రి వరకూ ఏపీజెన్‌కో థర్మల్‌ యూనిట్లు 10,108.196 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేయగా ఈ ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 12,994.987 మిలియన్‌ యూనిట్లు సరఫరా చేయడం విశేషం.

గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది కేవలం నాలుగన్నర స్వల్ప సమయంలో 2,886.791 మిలియన్‌ యూనిట్ల అధిక ఉత్పిత్తి చేయడం జెన్‌కో థర్మల్‌ యూనిట్ల ఉత్తమ పనితీరుకు నిదర్శనం. సమస్యలను అధిగమిస్తూ ఏపీ జెన్‌కో గరిష్ట స్థాయిలో రాష్ట్ర విద్యుత్‌ అవసరాలు తీర్చడం ద్వారా ప్రశంసలందుకుంటోంది. విద్యుత్‌ డిమాండు అనూహ్యంగా పెరిగిన నేపథ్యంలో రాష్ట్ర అవసరాలను 45 నుంచి 50 శాతం వరకూ సొంతంగా తీర్చడానికి సంస్థ పోటీపడి నిర్విరామంగా పనిచేస్తోంది. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఆరిక్థ సంవత్సరం విద్యుత్‌ ఉత్పత్తిలో సంస్థ ఘననీయమైన ప్రగతి సాధించింది.

పెరిగిన పీఎల్‌ఎఫ్‌

ఏపీజెన్‌కో తన అనుబంధ సంస్థ ఏపీపీడీసీఎల్‌తో కలిపి మొత్తం మూడు ప్లాంట్లలో 5,810 మెగావాట్ల ఉత్పత్తి సామర్థం గల థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలు నిర్వహిస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఆగస్టు 18వ తేదీ వరకూ ఈ కేంద్రాలు మొత్తం సగటు-న 51.84 పీఎల్‌ఎఫ్‌ సాధించగా ఈ సంవత్సరం ఇదే కాలంలో ఇది 66.61 శాతానికి పెరగడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది ఇదే కాలంలో రాయలసీమ థర్మల్‌ పవర్‌ ప్లాంటు (ఆర్టీపీపీ) పీఎల్‌ఎఫ్‌ 64.10 నుంచి 72.43 శాతానికి పెరిగింది. డాక్టర్‌ నార్ల తాతారావు థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (డాక్టర్‌ ఎన్‌టీటీపీఎస్‌) పీఎల్‌ఎఫ్‌ 73.59 నుంచి 78.38 శాతానికి చేరింది. దామోదరం సంజీవయ్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం పీఎల్‌ఎఫ్‌ 27.46 శాతం నుంచి 53.98 శాతానికి పెరిగింది.

- Advertisement -

వర్షాకాలంలో తగ్గాల్సిన విద్యుత్‌ డిమాండు కనీవినీ ఎరుగని రీతిలో పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర గ్రిడ్‌ అవసరాలు సాధ్యమైనంత ఎక్కువగా తీర్చాలనే లక్ష్యంతో ఏపీ జెన్‌కో ఉత్పత్తి పెంచుతూ వస్తోంది. బొగ్గు తడిగా ఉన్నందున పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ గరిష్ట స్థాయిలో ఉత్పత్తి చేసేందుకు ఏపీ జెన్‌కో ఉద్యోగులు నిరంతరం శ్రమిస్తూ ఫలితాలు సాధిస్తున్నారు. పెరుగుతున్న విద్యుత్‌ ఉత్పత్తే ఇందుకు నిదర్శనం. ప్లాంట్ల వారీగా ఉత్పత్తిని పరిశీలిస్తే…ఆర్టీపీపీలో ఈనెల 15వ తేదీ 26.71 ఎంయూ, 16న 29 ఎంయూ, 17న 29.10 ఎంయూ, 18న 27.647 ఎంయూ విద్యుత్‌ ఉత్పత్తి చేశారు.

ఎస్‌డీఎస్‌టీ-పీఎస్‌ లో ఈనెల 15వ తేదీ 12.75 ఎంయూ, 16న 18.57 ఎంయూ, 17న 24.32 ఎంయూ, 18న 24.80 ఎంయూ విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. డాక్టర్‌ ఎన్‌టీ-టీ-పీఎస్‌లో ఈనెల 15వ తేదీ 25.99 ఎంయూ, 16న 29.40 ఎంయూ, 17న 32.08 ఎంయూ, 18న 27.647 ఎంయూ విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. గత ఏడాది ఆగస్టు 18 న ఏపీజెన్‌కో థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి 60.616 మిలియన్‌ యూనిట్లు- కాగా ఈ ఏడాది ఇదే రోజు ఉత్పత్తి 84.537 మిలియన్‌ యూనిట్లు- కావడం గమనార్హం.

గరిష్ట ఉత్పత్తి ఇలా

ఆర్టీపీపీ మూడో యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు-కాగా 08-05-2023న ఏకంగా 224 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి నమోదు చేయడం విశేషం.

ఆర్టీపీపీ ఒకటో యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు- కాగా 25-05-2023న 219 మెగావాట్లు- ఉత్పత్తి నమోదైంది.

డాక్టర్‌ ఎన్టీటీ-పీఎస్‌ ఆరో యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు- కాగా 15-05-2023న 219 మెగావాట్ల గరిష్ట ఉత్పత్తి నమోదైంది.

డాక్టర్‌ ఎన్టీటీ-పీఎస్‌ అయిదో యూనిట్‌ ఉత్పత్తి సామర్థ్యం 210 మెగావాట్లు- కాగా 24-5-2023న 217 మెగావాట్లు- ఉత్పత్తి చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement