Sunday, April 28, 2024

దళితబంధు చారిత్రాత్మకం.. 78 మందికి యూనిట్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్​ బాల్క‌ సుమ‌న్‌

చెన్నూరు, ప్రభన్యూస్‌: దళిత బంధు చారిత్రాత్మకమైన పథకమని రాష్ట్ర ప్రభుత్వ విప్‌, చెన్నూరు శాసనసభ్యులు బాల్క సుమన్‌ పేర్కొన్నారు. గురువారం మంచిర్యాల జిల్లా చెన్నూరులో అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వం దళిత బంధు పథకం ద్వారా 78 మంది లబ్ధిదారులకు మంజూరు చేసిన యూనిట్లను పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారన్నారు.

ఒక్కో యూనిట్‌కు రూ. 10 లక్షలు కేటాయించారని, దీంతో దళితులు లక్షాధికారులుగా మారారన్నారు. ప్రపంచంలో దళితుల అభివృద్ధికి ఏ ప్రభుత్వం అమలు చేయని విధంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం దలిత బంధు అమలు చేస్తుందని, లబ్ధిదారులు ప్రభుత్వం అందించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్లమెంట్‌ సభ్యులు వెంకటేష్‌ నేత, జిల్లా కలెక్టర్‌ భారతి హోళీకేరి, ఎమ్మెల్యేలు దివాకర్‌రావు, చిన్నయ్యతోపాటు- లబ్ధిదారులు పాల్గొన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement