Saturday, May 4, 2024

12వ తేది నుంచి రైతుల‌కు ఎకరానికి రూ.10 వేలు అంద‌జేత‌..

ఉమ్మడి వరంగల్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: అకాల వర్షాలు రైతాంగాన్ని అపార కష్ట నష్టాల్లోకి నెడుతున్నాయి. ఎండా కాలంలో కూడా వానలు దంచికొడుతున్నాయి. ఎక్కడి ధాన్యం అక్కడే తడిసిపోతున్నది అయితే, రైతులు ఆ ధైర్యపడవద్దు.. ముఖ్యమంత్రి కేసిఆర్‌ అండగా ఉన్నారంటూ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీ టి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెప్పారు. బుధవారం హనుమ కొండలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ మనుస్సున్న మహారాజు కాబట్టే తడిసిన ధాన్యం మొత్తం కొనుగోలుచేస్తామని ప్రకటించి రైతులకు కొండంత భరోసాను ఇచ్చారని అన్నారు. మరో మూడు రోజులపాటు వర్షాలు ఉన్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటిస్తోంది. రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి సూచించారు. వ్యవసాయ అధికారులు వర్షాలు తగ్గిన తర్వాత క్షేత్రస్థాయిలోకి వెళ్లి పంటనష్టం అంచనా వేసి నివేదికలు పంపించాలని ఆదేశించారు.

అకాల వర్షాలు, వడగళ్ల వానకు దెబ్బతిన్న పంటలను గతనెల 23న ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా వరంగల్‌ జిల్లా పర్యటనకు వచ్చి పరిశీలించారు. రైతులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఎకరానికి 10 వేలరూపాయలచొప్పున పంటనష్టపరిహారాన్ని అందిస్తామని ప్రకటించడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. పంటనష్టపరిహారంకు సంబంధించిన చెక్కులను ఈనెల 12 నుంచి రైతులకు అందించనున్నట్లు మంత్రి దయాకర్‌రావు తెలిపారు. 12న వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చేతులమీదుగా వరంగల్‌ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందన్నారు.
అదేవిధంగా కౌలు రైతులకు నష్టం జరగకుండా ఆదుకుంటామని ముఖ్యమంత్రి కేసిఆర్‌ హామీ ఇచ్చారంటూ మంత్రి గుర్తుచేశారు. కౌలు రైతులకు చెక్కుల రూపేణా కాకుండా నేరుగా నగదు రూపేణ పరిహారాన్ని అందించాలని భావిస్తున్నామని మంత్రి దయాకర్‌రావు తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే నష్టపోయిన కౌలు రైతులవివరాలను కూడా అందించడం జరిగిందని పేర్కొన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీలు రైతులను రె చ్చగొట్టే రాజకీయం
ఒకవైపున అకాలవర్షాలకు పంటలు దెబ్బతిని పుట్టెడు దు:ఖంలో ఉన్న రైతులను ఆదుకోకుండా కల్లాల వద్దకు వెళ్లి బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి దయాకర్‌రావు మండిప డ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు పక్షపాతి కాబట్టే ధాన్యం కొనుగోళ్లతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధరకేకొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారని అన్నారు. అసలు దేశంలో బీజేపీ, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో రైతులను ఆదుకునేందుకు ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నారా…అంటూ నిలదీశారు. కనీ సం పంటనష్టపరిహారం అయినా.. అందిస్తున్నారా… దమ్మూ, ధైర్యం ఉంటే ముందుగా మీరు పాలిస్తున్న రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేసి పంటనష్టపరిహారం అందించడంటూ మంత్రి దయాకర్‌రావు హితవు ప లికారు.

షర్మిలా.. ఏపీలో ధర్నాలు చేసుకోండి
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అక్కడ పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. షర్మిలకు రైతులపైన ప్రేమ ఉంటే ఏపీకి వెళ్లి ధ ర్నా చేసుకోవాలని మంత్రి దయాకర్‌ాంవు సూచించారు. ఏపీలో జగ న్మోహన్‌రెడ్డి ప్రభుత్వం రైతులను ఆదుకుంటోందా.. మీ ధర్నాలు, ని రసనలు తెలంగాణలో కాదు..ఏపీలో చేసుకోవాలంటూ మంత్రి దయాకర్‌రావు చురకలు వేశారు.

మూడురోజుల్లో నివేదికలు ఇవ్వండి
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఎన్ని ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి.. రైతులు ఏఏ పంటలు సాగుచేశారు..ఎంత మేరకు నష్టం జరిగింది.. సొంత భూములు ఉన్న రైతులు ఎంత మంది సాగుచేస్తున్నారు..కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు..పూర్తివివరాలతో మూడు రోజుల్లో నివేదిక ఇవ్వాలంటూ మంత్రి దయాకర్‌రావు వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement