Monday, April 29, 2024

KNR | విద్యార్థుల్లోని సృజనాత్మక శక్తిని వెలికి తీసేలా క్రాఫ్ట్ కోర్సులు

కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి టెక్నికల్ టీచర్స్ శిక్షణ కమ్​ ప్రదర్శన శిబిరం ఇవ్వాల (ఆదివారం) ప్రారంభం అయ్యింది. విద్యార్థులలోని సృజనాత్మక శక్తిని వెలికి తీసేందుకు ఈ టెక్నికల్ క్రాఫ్ట్ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. కరీంనగర్​లో ఈ ప్రదర్శని శిబిరాన్ని వినోద్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల దశలోనే క్రాఫ్ట్ కోర్సులను నేర్పించడం ద్వారా విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీసే అవకాశం ఉంటుందని అన్నారు.

మ్యూజిక్, పెయింటింగ్, కార్పెంటరీ, ఎంబ్రాయిడరీ, టైలరింగ్, టీవీ, మొబైల్ రిపేర్ వంటి క్రాఫ్ట్ కోర్సులు పాఠశాలల్లో శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో క్రాఫ్ట్ కోర్సులు ఉండేవని, కానీ.. గత పాలకులు ఈ కోర్సులను బోధించే టీచర్స్ నియామకాలను నిలిపి వేయడంతో విద్యార్థులకు క్రాఫ్ట్ కోర్సులు నేర్పించే వారు లేకుండా పోయారన్నారు. రానున్న కాలంలో పాఠశాలల్లోనే విద్యార్థులకు క్రాఫ్ట్ కోర్సులు నేర్పించాల్సిన ఆవశ్యకత ఉందని, శిక్షణ ఇచ్చేందుకు క్రాఫ్ట్ టీచర్స్ పోస్టులు భర్తీ చేయాల్సిన అవసరం ఉందని వినోద్ కుమార్ అభిప్రాయ పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement