Thursday, April 25, 2024

హోం కేర్ స‌క్సెస్…

హైదరాబాద్‌, : సెకండ్‌వేవ్‌లో భాగంగా గత నెల రోజులుగా కొవిడ్‌ కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోుం ఆస్ప త్రులు నిండిపోయిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది కొవిడ్‌ బారిన పడ్డ పేషెంట్‌లు ఆస్పత్రుల్లో బెడ్‌ దొరకక ఇళ్లలోనే హోం కేర్‌ విధానంలో చికిత్స తీసుకున్నట్లు గణాంకాలు చెబుతు న్నాయి. సాధారణంగా కొవిడ్‌ యాక్టివ్‌ కేసుల్లో 3 నుంచి 4 శాతం దాకా ఆస్పత్రిలో చేరే స్థితిలో ఉంటారని అధ్యయనాలు చెబుతు న్నాయి. కేసులు తక్కువగా ఉన్నపుడైతే ఆస్పత్రి పాలయ్యే సంఖ్యతో ఇబ్బంది లేదని, వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉన్నపుడే ఆస్పత్రుల్లో బెడ్లు దొరకక చాలా మంది ఇబ్బంది పడాల్సిన పరిస్థితి భారత్‌ లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఉంటుం దని అధ్యయనాల్లో పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సెకండ్‌వేవ్‌లో రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోకెల్లా ఎక్కువగా కేసులు నమోదవుతున్న గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోనూ కార్పొరేట్‌ ఆస్పత్రుల నుంచి చిన్న, మధ్య తరహా ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ బెడ్‌లన్నీ కొవిడ్‌ రోగులతో నిండిపోయాయి. దీంతో బెడ్‌లు దొరకని చాలా మంది పేషెంట్‌లు ఇళ్లలోనే హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్న కొవిడ్‌ పేషెంట్‌లలో చాలా మందిని వారి ఫ్యామిలీ డాక్టర్లు లేదా ఇతర డాక్టర్లు రోజూ పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పద్ధతిలో హోం ఐసోలేషన్‌లో ఉన్న పేషెంట్‌ లకు చికిత్సనందించేందుకు ఒక్కో డాక్టర్‌ రోజుకు 5కు పైగా ఇళ్ల వరకు విజిట్‌ చేస్తున్నట్లు చెబుతున్నారు. కాగా, కొవిడ్‌ హోం ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న వారిలోనే ఎక్కువ మంది తీవ్రమైన కండిషన్‌లో నుంచి కోలుకుంటున్నట్లు డాక్టర్లు పేర్కొంటున్నారు. దీనికి కారణం ఇళ్లలో ప్రత్యేక గదిలో ఐసోలేషన్‌లో ఉండి అయినవాళ్ల సహకారంతో అన్ని రకాల మందులు జాగ్రత్తగా వాడడమేనని వారంటున్నారు. చుట్టూ కావాల్సిన వాళ్లున్నపు డు మానసికంగా ధైర్యంగా ఉండడంతో పాటు ఇంట్లో బలవర్ధక ఆహారం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి వైరస్‌ తోకముడు స్తోందని తమ పరిశీలనలో తెలిసినట్లు డాక్టర్లు వివరిస్తున్నారు. హోం ట్రీట్‌మెంట్‌లో వయసుతో సంబంధం లేకుండా వృద్ధులు కూడా కరోనా సీరియస్‌ కండీషన్‌ నుంచి కోలుకుంటున్నట్లు ఇళ్లలో కొవిడ్‌ పేషెంట్‌లకు చికిత్సనందిస్తున్నపుడు తమ నోటీసుకు వచ్చిందని పలువురు డాక్టర్లు పేర్కొంటున్నారు. నిజానికి కొవిడ్‌ వృద్ధులకు వస్తే తగ్గదనేది సైంటిఫిక్‌ ఆధారం లేకుండా ప్రచారంలోకి వచ్చిన ఒక అంశం మాత్రమేనని వారు కొట్టి పారేస్తున్నారు.
వృద్ధులు కరోనా వస్తే బతకరనేది ఆధారం లేని అంశం
సెకండ్‌ వేవ్‌ ప్రారంభమైన తర్వాత మా గ్రాండ్‌ ఫాదర్‌కు కొవిడ్‌ సోకింది. ఆయన వయసు 70 సంవత్సరాలు. హైదరా బాద్‌లోనే మాకు తెలిసిన ఒక ప్రైవేట్‌ ఆస్పత్రికి ఫోన్‌ చేస్తే బెడ్‌ లేదన్నారు. బెడ్‌ ఇప్పట్లో దొరదని, మా కంటే చాలా మంది ముందుగానే వెయిటింగ్‌లో ఉన్నారని చెప్పారు. అయితే మాకు తెలిసిన ఆస్పత్రి కావడంతో వారు ఒక డాక్టర్‌ను మాకు కేటాయి ంచడంతో పాటు ఆక్సిజన్‌ సిలిండర్‌ సదుపాయం కల్పించి ఇంట్లోనే చికిత్స తీసుకునేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. దీంతో వెంటనే మా తాతాను ఇంటికి తీసుకెళ్లి ఆక్సిజన్‌ పెట్టి చికిత్స ప్రారంభించాం. డాక్టర్‌ రోజూ వచ్చి చూశారు. కుటుంబ సభ్యులంతా ఎంతో కేర్‌ తీసుకున్నాం. దీంతో రోజురోజుకు ఆయన ఆరోగ్యం మెరుగవుతూ వచ్చింది. ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఎప్పటిలానే ఆయన మాతో సరదాగా గడుపుతు న్నారు. కరోనా వస్తే వృద్ధులు కోలుకోరని నిర్లక్ష్యం చేయడం సరికాదని నేను అందరికీ చెప్పదలుచుకున్నానని ఇటీవల కొవిడ్‌ నుంచి తన తాతను ఇంట్లోనే చికిత్సనందించి సాధారణ స్థితికి తీసుకొచ్చిన ఓ మనవడు చెప్పిన మాటలివి.
బెడ్‌ దొరికితే పరిస్థితి ఎలా ఉండేదో…కొవిడ్‌ నుంచి కోలుకున్న ఓ 45 ఏళ్ల వ్యాపారి
నేను వ్యాపారం చేసుకునే వాన్ని. నా వయసు 45 సంవత్సరాలు. నా సంపాదనే మా ఇంటికి ఆధారం. వ్యాపార లావాదేవీల్లో భాగంగా రోజులో 15 గంటలు బయటే తిరగాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈ క్రమంలోనే నాకు కొవిడ్‌ సోకింది. అయితే ప్రస్తుతం నేనున్న ఆర్థిక పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో బెడ్‌ దొరికే పరిస్థితి లేకపోవడంతో తెలిసిన డాక్టర్‌ సహాయంతో ఇంట్లోనే చికిత్స తీసుకున్నాను. ఇంట్లో వాళ్ల ప్రేమతో పాటు డాక్టర్‌ సూచనలు పాటించడంతో నేను కొవిడ్‌ నుంచి కోలుకున్నాను. ఆస్పత్రిలో బెడ్‌ దొరకకపోవడం వల్లే కోలుకున్నానని అనిపిస్తుందని ఇటీవలే హోం ట్రీట్‌మెంట్‌ తీసుకుని కొవిడ్‌ నుంచి కోలుకున్న హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి వివరించారు.

కావల్సిన వారి మధ్యలో ఉన్నామనే ధైర్యమే వారిని బతికిస్తోంది… డాక్టర్లు
హోం ట్రీట్‌మెంట్‌ తీసుకుని కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో కామన్‌గా నేను గమనించిన విషయమేంటంటే వారికి కావల్సిన వ్యక్తుల మధ్యలో ఉన్నామన్న ధైర్యమే 50 శాతం వైరస్‌ నుంచి విముక్తి కలిగించింది. ఇంట్లో వాళ్లు వండిపెట్టే ఆహారం మరింతగా వైరస్‌ను ఎదుర్కోవడానికి ఉపయోగపడింది. ఆ తర్వాతే నేను ఇచ్చిన మందులు, ఇంజక్షన్‌లు పనిచేశాయని చెప్పకతప్పదని ఇటీవలి కాలంలో రోజుకు 10 మందికిపైగా కొవిడ్‌ పేషెంట్‌లకు చికిత్సనంది స్తున్న ఓ డాక్టర్‌ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement