Thursday, May 2, 2024

భారీ వర్షానికి నీట మునిగిన పత్తి పంట

వికారాబాద్, జూలై 20 ( ప్రభ న్యూస్): గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి వికారాబాద్ జిల్లాలోని పలు మండలాల్లో పంటలు పూర్తిగా నీటి మునిగాయి. గత కొంతకాలంగా వర్షం కోసం ఎదురుచూసిన రైతన్నలకు గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పంటలన్నీ నీటమునిగాయి. ప్రధానంగా పత్తి మొక్కజొన్న తదితర పంటలతో పాటు కూరగాయల పంటలు నీటిమనగడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్ మండలంతో పాటు నవాబ్పేట మొగిలిపేట మర్పల్లి దారురు పూడూర్ కోటిపల్లి బంటారం మండలాల్లో గురువారం ఉదయం భారీ వర్షం కురిసింది. గతంలో వర్షాలకు ఆందోళన చెందిన రైతులు ప్రస్తుతం భారీ వర్షాలకు పంటలు మునిగి తీవ్ర మనోవేదన గురవుతున్నారు. భారీ వర్షంతో వికారాబాద్ పట్టణంతోపాటు మండల కేంద్రంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement