Monday, October 7, 2024

NZB | భైంసాలో కార్డ‌న్‌ సెర్చ్.. పేప‌ర్స్ లేని 93 బైకులు సీజ్

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో పోలీసులు ఇవ్వాల (సోమవారం) ఉదయం కార్డన్​ సెర్చ్​ నిర్వహించారు. ఈ నాకాబందీని పులే నగర్ లో ఏఎస్పీ సుభాష్ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో చేపట్టారు. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్​ నిర్వహించారు.

శాంతిభద్రతల చర్యల్లో భాగంగానే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్​లు నిర్వహించినట్లు సీఐ శీను తెలిపారు. ఇందులో భాగంగా ఎలాంటి పేపర్స్​ లేని 93 ద్విచక్ర వాహనాలు, 2 కార్లను స్వాధీనం చేసుకున్నారు. నేరాల నియంత్రణ, అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకే కమ్యూనిటీ కార్డన్​ సెర్చ్​ ప్రోగ్రామ్​ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement