Monday, April 29, 2024

Congress – ఖ‌మ్మం టిక్కెట్ కావాలే – భారీ మెజార్టీతో గెలుస్తా – వీహెచ్

ఖమ్మం టికెట్ తనకిస్తే భారీ మెజారిటీతో గెలుస్తానని మాజీ ఎంపీ వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల కలిశానని ఖమ్మం సీటు కావాల‌ని కోరానని అన్నారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటానని తెలిపారు. గాంధీ భ‌వ‌న్ లో ఆయ‌న మంగ‌ళ‌వారం మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్‌లో ఎవరెవరు ఉన్నారో తెలియాలన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో రికార్డ్ చేశారని తెలిపారు. ఇందులో ఇంకా చాలా అంశాలు బయటకు రావాలన్నారు. రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్ ల ఫోన్లు ట్యాప్ చేశారన్నారు. ఫోన్ ట్యాపింగ్‌లో అసలు సూత్రధారులు ఎవరు? అని ప్ర‌శ్నించారు. ట్యాపింగ్ లో ఇప్పటికే పలువురు అధికారులు అరెస్ట్ అయ్యారని చెప్పారు.

న‌యీం ఆస్తులు స్వాహా చేసిందెవ‌రు

గ్యాంగ్‌స్ట‌ర్ట్ న‌యీం గతంలో కోట్ల రూపాయలు, భూములు కాజేశాడని, నయీం మరణం తర్వాత అక్కడ దొరికిన డబ్బులు ఏమయ్యాయని వీహెచ్ ప్రశ్నించారు.. పేదల భూములు నయీం లాక్కున్నారు ఏమయ్యాయన అన్నారు. అప్ప‌ట్లో శివానందరెడ్డి. 2500 కోట్ల ఆస్తులు, భూములు ఆక్రమించారన్నారు. శివనంద రెడ్డి వెనుక నయీం ఉన్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వీటి పై విచారణ జరిపితే ఆ భూములను పేద ప్రజలకు ఇవ్వొచ్చన్నారు. నయీం డబ్బులు,సొమ్ము ఏమయ్యాయి ఎవరు చెప్పలేదన్నారు. ఫోన్ ట్యాపింగ్ ను ప్రభుత్వం ఎలా సీరియస్ గా తీసుకుందో ,నయీం డబ్బులు,అస్తులు ఏమయాయ్యో విచారణ జరపాలన్నారు. అప్పుడు సీట్ అధికారిగా ఉన్న‌ నాగిరెడ్డికి అన్ని తెలుసంటూ విహెచ్ పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement