Wednesday, May 1, 2024

TS : ఇవాళ‌ తుక్కుగూడలో కాంగ్రెస్ జన జాతర బహిరంగ సభ..

నేటి సాయంత్రం తుక్కుగూడలోని రాజీవ్ గాంధీ ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జన జాతర పేరుతో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభలో కాంగ్రెస్ పార్టీ జాతీయ మేనిఫెస్టోను ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ రిలీజ్ చేయనున్నారు.

- Advertisement -

అయితే, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి రెండు సార్లు సభా స్థలికి వెళ్లి ఏర్పాట్లను పర్యవేక్షించడంతో పాటు ప్రతి రోజు మంత్రులు, ఎమ్మెల్యేలు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సుమారు 10 లక్షల మంది జనాలను సమీకరించేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసింది. అందులో ప్రధానంగా లక్ష మంది మహిళలను వేదిక ముందు వరసలో కూర్చో బెట్టి, రాష్ట్రంలో అమలవుతున్న ఆరు పథకాలకు ధన్యవాదాలు చెప్పించేందుకు తగిన ఏర్పాట్లను కాంగ్రెస్ చేస్తుంది. దీంతో పాటు 10 లక్షల మంది జన సమీకరణ చేయాలని కాంగ్రెస్ ప్రణాళిక రూపొందించగా దాని కోసం 70 ఎకరాల్లో సభ ప్రాంగణం కేటాయించగా.. 550 ఎకరాల్లో వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేసింది. సెప్టెంబర్ 17వ తేదీన అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే ప్రాంగణంలో సభ నిర్వహించి ఆరు గ్యారంటీలను సోనియా గాంధీ విడుదల చేసింది. అదే సెంటిమెంట్‌ను మరోసారి రిపీట్ చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుంది.

ఇక, తెలంగాణ రాష్ట్రంలో 14 లోక్ సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు సీఎం రేవంత్ రెడ్డి వ్యూహా రచన చేస్తున్నారు. అలాగే, గెలుపు కోసం మండల స్థాయి మొదలు పార్లమెంటరీ నియోజకవర్గ నాయకుల వరకు అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆయన ముందుకు వెళ్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లోనూ పట్టు సాధించి పార్టీ అధిష్టానానికి మరోమారు తన సత్తా ఏంటో చూపించాలని రేవంత్ రెడ్డి ట్రై చేస్తున్నారు. లోక్‌సభ షెడ్యూల్ రిలీజైనప్పటి నుంచి ఇంటి నుంచే తన పని చేస్తున్నాడు. లోక్ సభ ఎన్నికలలో పార్టీ బలాబలాలపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకొని దానికి అనుగుణంగా రేవంత్‌రెడ్డి కార్యాచరణ చేస్తున్నాడు. ఇందు కోసం ఆయా నియోజకవర్గాల్లోని కీలక నేతలకు ప్రభుత్వ సలహాదారుతో రాయబారం పంపిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement