Friday, May 3, 2024

AP : 9వ రోజు సీఎం జగన్​ మేమంతా సిద్ధం యాత్ర…

సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఇవాళ 9వ రోజుకు చేరుకుంది. జగన్ ఉదయం నెల్లూరు పరిధిలోని చింతారెడ్డి పాలెంలో బస చేసిన ప్రాంతం నుంచి బయలుదేరుతారు. జనార్దన్ రెడ్డి కాలనీ..కోవూరు క్రాస్, సున్నపుబట్టి, తిప్ప, గౌరవరం మీదగా ఆర్.ఎస్.ఆర్. ఇంటర్నేషనల్ స్కూల్ వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.

- Advertisement -

అనంతరం కావలి సమీపంలోని జాతీయ రహదారి వద్ద సాయంత్రం 3 గంటలకు జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఏలూరుపాడు, ఉలవపాడు క్రాస్, సింగరాయకొండ క్రాస్, ఓగురు, కందుకూరు, పొన్నలూరు, వెంకుపాలెం మీదుగా జువ్విగుంట క్రాస్ వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బసకు చేరుకుంటారు సీఎం జగన్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement